2 Samuel · chapter 22 · verse 27
2 Samuel 22:27 in Telugu
సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
Sadbhaavamugala vaariyedala neevu sadbhaavamu choopuduvu moorkhulayedala neevu vikatamugaa nunduvu.
2 Samuel 22:27 in English
- King James Version (KJV)
- With the pure thou wilt shew thyself pure; and with the froward thou wilt shew thyself unsavoury.
- World English Bible (WEB)
- With the pure you will show yourself pure. With the crooked you will show yourself shrewd.
- American Standard Version (ASV)
- With the pure thou wilt show thyself pure; And with the perverse thou wilt show thyself froward.
- Bible in Basic English (BBE)
- He who is holy will see that you are holy; but to the man whose way is not straight you will be a hard judge.
- Darby Translation (DBY)
- With the pure thou dost shew thyself pure; And with the perverse thou dost shew thyself contrary.
- Webster's Bible (WBS)
- With the pure thou wilt show thyself pure; and with the froward thou wilt contend.
- Young's Literal Translation (YLT)
- With the pure Thou shewest Thyself pure, And with the perverse Thou shewest Thyself a wrestler.
Read in context
- 25కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
- 26దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
- 27సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
- 28శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
- 29యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
Cross references
- Psalm 18:26 కీర్తనలు 18:26సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
- Matthew 5:8 మత్తయి 5:8హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
- Leviticus 26:23–28 లేవీయకాండము 26:23–28శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీమీదికి ఖడ్గమును రప్పించె దను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
- Psalm 125:5 కీర్తనలు 125:5తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Isaiah 45:9 యెషయా 45:9మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
- Deuteronomy 28:58–61 ద్వితీయోపదేశకాండము 28:58–61నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయ బడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.
- Exodus 18:11 నిర్గమకాండము 18:11ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.