2 Timothy · chapter 4 · verse 6
2 Timothy 4:6 in Telugu
నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
Nenippude paanaarpanamuga poyabaduchunnaanu, nenu vedalipovu kaalamu sameepamai yunnadi.
2 Timothy 4:6 in English
- King James Version (KJV)
- For I am now ready to be offered, and the time of my departure is at hand.
- World English Bible (WEB)
- For I am already being offered, and the time of my departure has come.
- American Standard Version (ASV)
- For I am already being offered, and the time of my departure is come.
- Bible in Basic English (BBE)
- For I am even now being offered, and my end is near.
- Darby Translation (DBY)
- For I am already being poured out, and the time of my release is come.
- Webster's Bible (WBS)
- For I am now ready to be offered, and the time of my departure is at hand.
- Young's Literal Translation (YLT)
- for I am already being poured out, and the time of my release hath arrived;
Read in context
- 4సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
- 5అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
- 6నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
- 7మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
- 8ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
Cross references
- Philippians 1:23 ఫిలిప్పీయులకు 1:23ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
- Philippians 2:17 ఫిలిప్పీయులకు 2:17మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును.
- 2 Peter 1:14–15 2 పేతురు 1:14–15నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
- Joshua 23:14 యెహోషువ 23:14ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమున వెళ్లుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.
- Genesis 48:21 ఆదికాండము 48:21మరియు ఇశ్రాయేలు - ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.
- Numbers 27:12–17 సంఖ్యాకాండము 27:12–17మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
- Genesis 50:24 ఆదికాండము 50:24యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
- Deuteronomy 31:14 ద్వితీయోపదేశకాండము 31:14మరియు యెహోవాచూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,