Numbers · chapter 27 · verse 12
Numbers 27:12 in Telugu
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
Mariyu yehovaa mosheto itlanenuneevu ee abaareemu kondayekki nenu ishraayeleeyulaku ichchina deshamunu choodumu.
Numbers 27:12 in English
- King James Version (KJV)
- And the LORD said unto Moses, Get thee up into this mount Abarim, and see the land which I have given unto the children of Israel.
- World English Bible (WEB)
- The LORD said to Moses, “Go up into this mountain of Abarim, and see the land which I have given to the children of Israel.
- American Standard Version (ASV)
- And Jehovah said unto Moses, Get thee up into this mountain of Abarim, and behold the land which I have given unto the children of Israel.
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses, Go up into this mountain of Abarim so that you may see the land which I have given to the children of Israel.
- Darby Translation (DBY)
- And Jehovah said to Moses, Get thee up into this mount Abarim, and see the land that I have given unto the children of Israel.
- Webster's Bible (WBS)
- And the LORD said to Moses, Ascend this mount Abarim, and see the land which I have given to the children of Israel.
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto Moses, 'Go up unto this mount Abarim, and see the land which I have given to the sons of Israel;
Read in context
- 10వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.
- 11వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.
- 12మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
- 13నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.
- 14ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.
Cross references
- Numbers 33:47–48 సంఖ్యాకాండము 33:47–48అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి. అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
- Deuteronomy 34:1–4 ద్వితీయోపదేశకాండము 34:1–4మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
- Deuteronomy 3:23–27 ద్వితీయోపదేశకాండము 3:23–27మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు. ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు? నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
- Deuteronomy 32:48–52 ద్వితీయోపదేశకాండము 32:48–52ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీ మను ఈ పర్వతము, అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజ నులయొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్య ములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.