Acts · chapter 9 · verse 1
Acts 9:1 in Telugu
సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
Saulu inkanu prabhuvuyokka shishyulanu bedarinchutayunu hatyacheyutayunu tanaku praanaadhaaramainattu pradhaanayaajakuniyoddaku velli
Acts 9:1 in English
- King James Version (KJV)
- And Saul, yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went unto the high priest,
- World English Bible (WEB)
- But Saul, still breathing threats and slaughter against the disciples of the Lord, went to the high priest
- American Standard Version (ASV)
- But Saul, yet breathing threatening and slaughter against the disciples of the Lord, went unto the high priest,
- Bible in Basic English (BBE)
- But Saul, still burning with desire to put to death the disciples of the Lord, went to the high priest,
- Darby Translation (DBY)
- But Saul, still breathing out threatenings and slaughter against the disciples of the Lord, came to the high priest
- Webster's Bible (WBS)
- And Saul, yet breathing out threatenings and slaughter against the disciples of the Lord, went to the high priest,
- Young's Literal Translation (YLT)
- And Saul, yet breathing of threatening and slaughter to the disciples of the Lord, having gone to the chief priest,
Read in context
- 1సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
- 2యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.
- 3అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
Cross references
- Acts 8:3 అపొస్తలుల కార్యములు 8:3సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.
- 1 Timothy 1:13 1 తిమోతికి 1:13నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
- Galatians 1:13 గలతీయులకు 1:13పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు
- Acts 9:11–21 అపొస్తలుల కార్యములు 9:11–21అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను. వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి.
- 1 Corinthians 15:9 1 కొరింథీయులకు 15:9ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
- Acts 7:58 అపొస్తలుల కార్యములు 7:58పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.
- Acts 22:3–5 అపొస్తలుల కార్యములు 22:3–5నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని. ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.
- Acts 26:9–11 అపొస్తలుల కార్యములు 26:9–11నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- Philippians 3:6 ఫిలిప్పీయులకు 3:6ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
- Psalm 27:12 కీర్తనలు 27:12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
Original words (Greek)
- And · G1161δέ dé
- Saul · G4569Σαῦλος Saûlos
- yet · G2089ἔτι éti
- out · G1709ἐμπνέω empnéō
- threatenings · G547ἀπειλή apeilḗ
- and · G2532καί kaí
- slaughter · G5408φόνος phónos
- against · G1519εἰς eis
- disciples · G3101μαθητής mathētḗs
- Lord · G2962κύριος kýrios
- unto · G4334προσέρχομαι prosérchomai
- priest · G749ἀρχιερεύς archiereús