Deuteronomy · chapter 13 · verse 8
Deuteronomy 13:8 in Telugu
వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
Vaari maataku sammatimpakoodadu; vaarimaata vinakoodadu, vaarini kataakshimpakoodadu; vaariyandu jaali padakoodadu, vaarini maatuparachakoodadu; avashyamugaa vaarini champavalenu.
Deuteronomy 13:8 in English
- King James Version (KJV)
- Thou shalt not consent unto him, nor hearken unto him; neither shall thine eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him:
- World English Bible (WEB)
- you shall not consent to him nor listen to him; neither shall your eye pity him, neither shall you spare, neither shall you conceal him;
- American Standard Version (ASV)
- thou shalt not consent unto him, nor hearken unto him; neither shall thine eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him:
- Bible in Basic English (BBE)
- Do not be guided by him or give attention to him; have no pity on him or mercy, and give him no cover;
- Darby Translation (DBY)
- thou shalt not consent unto him, nor hearken unto him; neither shall thine eye spare him, neither shalt thou pity him, neither shalt thou screen him,
- Webster's Bible (WBS)
- Thou shalt not consent to him, nor hearken to him; neither shall thy eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him:
- Young's Literal Translation (YLT)
- thou dost not consent to him, nor hearken unto him, nor doth thine eye have pity on him, nor dost thou spare, nor dost thou cover him over.
Read in context
- 6నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని
- 7భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
- 8వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
- 9చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.
- 10రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.
Cross references
- Proverbs 1:10 సామెతలు 1:10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
- Deuteronomy 19:13 ద్వితీయోపదేశకాండము 19:13వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగు నట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయ మైన దోషమును పరిహరింపవలెను.
- Deuteronomy 7:16 ద్వితీయోపదేశకాండము 7:16మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.
- Ezekiel 9:5–6 యెహెజ్కేలు 9:5–6నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెనుమీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి. అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా
- Galatians 1:8–9 గలతీయులకు 1:8–9మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
- 1 John 5:21 1 యోహాను 5:21చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.
- Ezekiel 5:11 యెహెజ్కేలు 5:11నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
- Exodus 20:3 నిర్గమకాండము 20:3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.