Deuteronomy · chapter 2 · verse 12
Deuteronomy 2:12 in Telugu
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
Poorvakaalamuna horeeyulu sheyeerulo nivasinchiri. Ishraayeleeyulu yehovaa tamakichchina svaasthyamaina deshamulo chesinatlu eshaavu santaanapuvaaru horeeyula deshamunu svaadheena parachukoni tama yedutanundi vaarini nashimpajesi vaari deshamulo nivasinchiri.
Deuteronomy 2:12 in English
- King James Version (KJV)
- The Horims also dwelt in Seir beforetime; but the children of Esau succeeded them, when they had destroyed them from before them, and dwelt in their stead; as Israel did unto the land of his possession, which the LORD gave unto them.
- World English Bible (WEB)
- The Horites also lived in Seir in the past, but the children of Esau succeeded them. They destroyed them from before them, and lived in their place, as Israel did to the land of his possession, which the LORD gave to them.)
- American Standard Version (ASV)
- The Horites also dwelt in Seir aforetime, but the children of Esau succeeded them; and they destroyed them from before them, and dwelt in their stead; as Israel did unto the land of his possession, which Jehovah gave unto them).
- Bible in Basic English (BBE)
- And the Horites in earlier times were living in Seir, but the children of Esau took their place; they sent destruction on them and took their land for themselves, as Israel did to the land of his heritage which the Lord gave them.)
- Darby Translation (DBY)
- And in Seir dwelt the Horites in times past; and the children of Esau dispossessed them, and destroyed them from before them, and dwelt in their stead; as Israel did to the land of their possession, which Jehovah gave to them.)
- Webster's Bible (WBS)
- The Horims also dwelt formerly in Seir, but the children of Esau succeeded them, when they had destroyed them from before them, and dwelt in their stead; as Israel did to the land of his possession, which the LORD gave to them.)
- Young's Literal Translation (YLT)
- And in Seir have the Horim dwelt formerly; and the sons of Esau dispossess them, and destroy them from before them, and dwell in their stead, as Israel hath done to the land of his possession, which Jehovah hath given to them;
Read in context
- 10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.
- 11మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
- 12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
- 13కాబట్టిమీరు లేచి జెరెదు ఏరుదాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటి తివిు.
- 14మనము కాదేషు బర్నేయలోనుండి బయలు దేరి జెరెదు ఏరుదాటువరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు
Cross references
- Deuteronomy 2:22 ద్వితీయోపదేశకాండము 2:22అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.
- Genesis 14:6 ఆదికాండము 14:6ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత
- 1 Chronicles 1:38–54 1 దినవృత్తాంతములు 1:38–54శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను. లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
- Genesis 36:20–43 ఆదికాండము 36:20–43ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు. అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా. దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను. దీషాను కుమారులు ఊజు అరాను. హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నదీతీర మందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె. మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.
- Numbers 21:21–35 సంఖ్యాకాండము 21:21–35ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.
Original words (Hebrew)
- Horims · H2752חֹרִי Chôrîy
- dwelt · H3427יָשַׁב yâshab
- Seir · H8165שֵׂעִיר Sêʻîyr
- beforetime · H6440פָּנִים pânîym
- children · H1121בֵּן bên
- Esau · H6215עֵשָׂו ʻÊsâv
- succeeded · H3423יָרַשׁ yârash
- destroyed · H8045שָׁמַד shâmad
- before · H6440פָּנִים pânîym
- dwelt · H3427יָשַׁב yâshab
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- did · H6213עָשָׂה ʻâsâh
- land · H776אֶרֶץ ʼerets
- possession · H3425יְרֻשָּׁה yᵉrushshâh
- gave · H5414נָתַן nâthan