Deuteronomy · chapter 31 · verse 26
Deuteronomy 31:26 in Telugu
అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
Adi akkada neemeeda saakshyaarthamugaa undunu.
Deuteronomy 31:26 in English
- King James Version (KJV)
- Take this book of the law, and put it in the side of the ark of the covenant of the LORD your God, that it may be there for a witness against thee.
- World English Bible (WEB)
- “Take this book of the law, and put it by the side of the ark of the LORD your God’s covenant, that it may be there for a witness against you.
- American Standard Version (ASV)
- Take this book of the law, and put it by the side of the ark of the covenant of Jehovah your God, that it may be there for a witness against thee.
- Bible in Basic English (BBE)
- Take this book of the law and put it by the ark of the Lord's agreement, so that it may be a witness against you.
- Darby Translation (DBY)
- Take this book of the law, and put it at the side of the ark of the covenant of Jehovah your God, that it may be there for a witness against thee;
- Webster's Bible (WBS)
- Take this book of the law, and put it in the side of the ark of the covenant of the LORD your God, that it may be there for a witness against thee.
- Young's Literal Translation (YLT)
- 'Take this Book of the Law, and thou hast set it on the side of the ark of the covenant of Jehovah your God, and it hath been there against thee for a witness;
Read in context
- 24ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత
- 25మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.
- 26అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
- 27నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.
- 28నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.
Cross references
- Deuteronomy 31:19 ద్వితీయోపదేశకాండము 31:19కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.
- 2 Chronicles 34:14–15 2 దినవృత్తాంతములు 34:14–15యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మ శాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను. అప్పుడు హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రముగల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్ప గించెను.
- Galatians 2:19 గలతీయులకు 2:19నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.
- 2 Kings 22:8–11 2 రాజులు 22:8–11అంతట ప్రధానయాజకుడైన హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథ మును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆగ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను.
- Romans 3:19–20 రోమీయులకు 3:19–20ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
- 1 Kings 8:9 1 రాజులు 8:9ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
- 2 Kings 22:13–19 2 రాజులు 22:13–19మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెనుమిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియ జెప్పుడి యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొను చున్నది. యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీ కరించియున్నాను.