Deuteronomy · chapter 7 · verse 21
Deuteronomy 7:21 in Telugu
వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.
Vaarini choochi jadiyavaddu; nee devudaina yehovaa nee madhyanunnaadu, aayana bhayankarudaina mahaa devudu.
Deuteronomy 7:21 in English
- King James Version (KJV)
- Thou shalt not be affrighted at them: for the LORD thy God [is] among you, a mighty God and terrible.
- World English Bible (WEB)
- You shall not be scared of them; for the LORD your God is among you, a great and awesome God.
- American Standard Version (ASV)
- Thou shalt not be affrighted at them; for Jehovah thy God is in the midst of thee, a great God and a terrible.
- Bible in Basic English (BBE)
- Have no fear of them: for the Lord your God is with you, a great God greatly to be feared.
- Darby Translation (DBY)
- Thou shalt not be afraid of them; for Jehovah thy God is in thy midst, a God great and terrible.
- Webster's Bible (WBS)
- Thou shalt not be affrighted at them: for the LORD thy God [is] among you, a mighty God and terrible.
- Young's Literal Translation (YLT)
- thou art not terrified by their presence, for Jehovah thy God [is] in thy midst, a God great and fearful.
Read in context
- 19నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.
- 20మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.
- 21వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.
- 22నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమ ముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరముకాదు.
- 23అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయువరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును.
Cross references
- Nehemiah 1:5 నెహెమ్యా 1:5ఎట్లనగా - ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,
- Deuteronomy 10:17 ద్వితీయోపదేశకాండము 10:17ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
- Nehemiah 9:32 నెహెమ్యా 9:32చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయం కరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జను లందరిమీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్ప ముగా ఉండకుండును గాక.
- Joshua 3:10 యెహోషువ 3:10వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక
- Nehemiah 4:14 నెహెమ్యా 4:14అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోనువారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.
- Isaiah 8:9–10 యెషయా 8:9–10జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
- 1 Corinthians 14:25 1 కొరింథీయులకు 14:25అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
- Zechariah 12:2–5 జెకర్యా 12:2–5నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడు దురు. ఇదే యెహోవా వాక్కుఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులుయెరూషలేము నివా సులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పు కొందురు.
- 2 Chronicles 32:8 2 దినవృత్తాంతములు 32:8మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.
- Psalm 46:5 కీర్తనలు 46:5దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.
- Zechariah 2:10–11 జెకర్యా 2:10–11సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.
- 1 Samuel 4:8 1 సమూయేలు 4:8అయ్యయ్యో మహాశూరు డగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింప గలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.