Ephesians · chapter 5 · verse 13
Ephesians 5:13 in Telugu
సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
Samastamunu khandimpabadi velugucheta pratyakshaparachabadunu; pratyakshaparachunadi edo adi velugegadaa
Ephesians 5:13 in English
- King James Version (KJV)
- But all things that are reproved are made manifest by the light: for whatsoever doth make manifest is light.
- World English Bible (WEB)
- But all things, when they are reproved, are revealed by the light, for everything that reveals is light.
- American Standard Version (ASV)
- But all things when they are reproved are made manifest by the light: for everything that is made manifest is light.
- Bible in Basic English (BBE)
- But all things, when their true quality is seen, are made clear by the light: because everything which is made clear is light.
- Darby Translation (DBY)
- But all things having their true character exposed by the light are made manifest; for that which makes everything manifest is light.
- Webster's Bible (WBS)
- But all things that are reproved, are made manifest by the light: for whatever doth make manifest is light.
- Young's Literal Translation (YLT)
- and all the things reproved by the light are manifested, for everything that is manifested is light;
Read in context
- 11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- 12ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
- 13సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
- 14అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
- 15దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
Cross references
- John 3:20–21 యోహాను 3:20–21దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
- 1 Corinthians 4:5 1 కొరింథీయులకు 4:5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
- Hosea 2:10 హోషేయ 2:10దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.
- Hosea 7:1 హోషేయ 7:1నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- Lamentations 2:14 విలాపవాక్యములు 2:14నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచి యున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.