John · chapter 3 · verse 20
John 3:20 in Telugu
దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
Dushkaaryamu cheyu prativaadu velugunu dveshinchunu, tana kriyalu dushkriyalugaa kanabadakundunatlu velugunoddaku raadu.
John 3:20 in English
- King James Version (KJV)
- For every one that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved.
- World English Bible (WEB)
- For everyone who does evil hates the light and doesn’t come to the light, lest his works would be exposed.
- American Standard Version (ASV)
- For every one that doeth evil hateth the light, and cometh not to the light, lest his works should be reproved.
- Bible in Basic English (BBE)
- The light is hated by everyone whose acts are evil and he does not come to the light for fear that his acts will be seen.
- Darby Translation (DBY)
- For every one that does evil hates the light, and does not come to the light that his works may not be shewn as they are;
- Webster's Bible (WBS)
- For every one that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved.
- Young's Literal Translation (YLT)
- for every one who is doing wicked things hateth the light, and doth not come unto the light, that his works may not be detected;
Read in context
- 18ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
- 19ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
- 20దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
- 21సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
- 22అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.
Cross references
- Ephesians 5:11–13 ఎఫెసీయులకు 5:11–13నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
- John 7:7 యోహాను 7:7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
- Job 24:13–17 యోబు 24:13–17వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
- Proverbs 4:18 సామెతలు 4:18పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
- Proverbs 1:29 సామెతలు 1:29జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
- James 1:23–25 యాకోబు 1:23–25ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
- 1 Kings 22:8 1 రాజులు 22:8అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను.
- Psalm 50:17 కీర్తనలు 50:17దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
- Proverbs 15:12 సామెతలు 15:12అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
- Amos 5:10–11 ఆమోసు 5:10–11అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
- Proverbs 5:12 సామెతలు 5:12అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?
- Luke 11:45 లూకా 11:45అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మునుకూడ నిందించుచున్నావని ఆయ నతో చెప్పగా