Ephesians · chapter 5 · verse 32
Ephesians 5:32 in Telugu
ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
Ee marmamu goppadi; ayite nenu kreestunugoorchiyu sanghamunugoorchiyu cheppuchunnaanu.
Ephesians 5:32 in English
- King James Version (KJV)
- This is a great mystery: but I speak concerning Christ and the church.
- World English Bible (WEB)
- This mystery is great, but I speak concerning Christ and the assembly.
- American Standard Version (ASV)
- This mystery is great: but I speak in regard of Christ and of the church.
- Bible in Basic English (BBE)
- This is a great secret: but my words are about Christ and the church.
- Darby Translation (DBY)
- This mystery is great, but I speak as to Christ, and as to the assembly.
- Webster's Bible (WBS)
- This is a great mystery: but I speak concerning Christ and the church.
- Young's Literal Translation (YLT)
- this secret is great, and I speak in regard to Christ and to the assembly;
Read in context
- 30మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
- 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
- 32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
- 33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
Cross references
- Revelation 21:2 ప్రకటన 21:2మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
- 2 Corinthians 11:2 2 కొరింథీయులకు 11:2దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,
- Isaiah 54:5 యెషయా 54:5నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
- Revelation 19:7–8 ప్రకటన 19:7–8ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
- Colossians 2:2 కొలొస్సయులకు 2:2నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
- Isaiah 62:4–5 యెషయా 62:4–5విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును. యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
- 1 Timothy 3:16 1 తిమోతికి 3:16నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
- John 3:29 యోహాను 3:29పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.
- Song of Solomon 1:1–8 పరమగీతము 1:1–8సొలొమోను రచించిన పరమగీతము. నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము. నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను? నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.
- Psalm 45:9–17 కీర్తనలు 45:9–17నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.
- Ephesians 6:19 ఎఫెసీయులకు 6:19మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు