Esther · chapter 2 · verse 4
Esther 2:4 in Telugu
రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.
Raaju aa kanyakalalo deniyandu ishtapaduno aame vashtiki badulugaa raaniyagunu. Ee maata raajunaku anukoolamaayenu ganuka atadu aalaagu jariginchenu.
Esther 2:4 in English
- King James Version (KJV)
- And let the maiden which pleaseth the king be queen instead of Vashti. And the thing pleased the king; and he did so.
- World English Bible (WEB)
- and let the maiden who pleases the king be queen instead of Vashti.” The thing pleased the king, and he did so.
- American Standard Version (ASV)
- and let the maiden that pleaseth the king be queen instead of Vashti. And the thing pleased the king; and he did so.
- Bible in Basic English (BBE)
- And let the girl who is pleasing to the king be queen in place of Vashti. And the king was pleased with this suggestion; and he did so.
- Darby Translation (DBY)
- And let the maiden that pleaseth the king be queen instead of Vashti. And the thing pleased the king; and he did so.
- Webster's Bible (WBS)
- And let the maiden who pleaseth the king be queen instead of Vashti. And the thing pleased the king; and he did so.
- Young's Literal Translation (YLT)
- and the young woman who is good in the eyes of the king doth reign instead of Vashti;' and the thing is good in the eyes of the king, and he doth so.
Read in context
- 2¸యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,
- 3అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత
- 4రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.
- 5షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను.
- 6బబులోను రాజైన నెబు కద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు.
Cross references
- Matthew 14:6 మత్తయి 14:6అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను
- Matthew 20:16 మత్తయి 20:16ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
- Esther 1:21 ఎస్తేరు 1:21ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.
- Esther 3:9–10 ఎస్తేరు 3:9–10రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి
- Matthew 22:14 మత్తయి 22:14కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
- 2 Samuel 17:4 2 సమూయేలు 17:4ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.
- 2 Samuel 13:4–6 2 సమూయేలు 13:4–6రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబునీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను. అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
- 2 Samuel 16:21–23 2 సమూయేలు 16:21–23అహీతో పెలునీ తండ్రిచేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయు లందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.