Exodus · chapter 18 · verse 4
Exodus 18:4 in Telugu
నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
Naa tandri devudu naaku sahaayamai pharo kattivaata nundi nannu tappinchenanukoni rendavavaaniki eleeyejerani peru pettenu.
Exodus 18:4 in English
- King James Version (KJV)
- And the name of the other [was] Eliezer; for the God of my father, [said he, was] mine help, and delivered me from the sword of Pharaoh:
- World English Bible (WEB)
- The name of the other was Eliezer, for he said, “My father’s God was my help and delivered me from Pharaoh’s sword.”
- American Standard Version (ASV)
- and the name of the other was Eliezer; for [he said], The God of my father was my help, and delivered me from the sword of Pharaoh.
- Bible in Basic English (BBE)
- And the name of the other was Eliezer, for he said, The God of my father was my help, and kept me safe from the sword of Pharaoh:
- Darby Translation (DBY)
- — and the name of the other, Eliezer — For the God of my father has been my help, and has delivered me from the sword of Pharaoh.
- Webster's Bible (WBS)
- And the name of the other [was] Eliezer; (for the God of my father, [said he], [was] my help, and delivered me from the sword of Pharaoh:)
- Young's Literal Translation (YLT)
- and the name of the other [is] Eliezer, for, 'the God of my father [is] for my help, and doth deliver me from the sword of Pharaoh.'
Read in context
- 2మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.
- 3అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
- 4నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
- 5మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.
- 6యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా
Cross references
- Hebrews 13:6 హెబ్రీయులకు 13:6కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
- 2 Corinthians 1:8–10 2 కొరింథీయులకు 1:8–10సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.
- Acts 12:11 అపొస్తలుల కార్యములు 12:11పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.
- 2 Timothy 4:17 2 తిమోతికి 4:17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
- Psalm 18:1 కీర్తనలు 18:1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
- 1 Chronicles 23:15 1 దినవృత్తాంతములు 23:15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
- Psalm 34:4 కీర్తనలు 34:4నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
- Daniel 6:22 దానియేలు 6:22నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
- Psalm 46:1 కీర్తనలు 46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
- Exodus 2:15 నిర్గమకాండము 2:15ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.
- Isaiah 50:7–9 యెషయా 50:7–9ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.
- Psalm 18:48 కీర్తనలు 18:48ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు