Exodus · chapter 22 · verse 20
Exodus 22:20 in Telugu
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
Yohovaaku maatrame gaaka veroka devuniki bali arpinchuvaadu shaapagrastudu.
Exodus 22:20 in English
- King James Version (KJV)
- He that sacrificeth unto [any] god, save unto the LORD only, he shall be utterly destroyed.
- World English Bible (WEB)
- “He who sacrifices to any god, except to the LORD only, shall be utterly destroyed.
- American Standard Version (ASV)
- He that sacrificeth unto any god, save unto Jehovah only, shall be utterly destroyed.
- Bible in Basic English (BBE)
- Complete destruction will come on any man who makes offerings to any other god but the Lord.
- Darby Translation (DBY)
- — He that sacrificeth to [any] god, save to Jehovah only, shall be devoted to destruction.
- Webster's Bible (WBS)
- He that sacrificeth to [any] god, save to the LORD only, he shall be utterly destroyed.
- Young's Literal Translation (YLT)
- 'He who is sacrificing to a god, save to Jehovah alone, is devoted.
Read in context
- 18శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
- 19మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
- 20యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
- 21పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
- 22విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.
Cross references
- Deuteronomy 17:2–5 ద్వితీయోపదేశకాండము 17:2–5నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.
- Deuteronomy 18:20 ద్వితీయోపదేశకాండము 18:20అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.
- Numbers 25:7–8 సంఖ్యాకాండము 25:7–8యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి, సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.
- Deuteronomy 13:1–15 ద్వితీయోపదేశకాండము 13:1–15ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.
- Numbers 25:2–4 సంఖ్యాకాండము 25:2–4ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.
- Numbers 21:3 సంఖ్యాకాండము 21:3యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
- Joshua 23:15–16 యెహోషువ 23:15–16అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియ మించిన ఆయన నిబంధనను మీరి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించినయెడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన యీ మంచి దేశ ములో నుండ కుండ మీరు శీఘ్రముగా నశించి పోవుదురు.