Exodus · chapter 36 · verse 10
Exodus 36:10 in Telugu
అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.
Ayidu teralanu oka daanito okati koorchenu; migilina ayidu teralanu okadaanito okati koorchenu.
Exodus 36:10 in English
- King James Version (KJV)
- And he coupled the five curtains one unto another: and [the other] five curtains he coupled one unto another.
- World English Bible (WEB)
- He coupled five curtains to one another, and the other five curtains he coupled to one another.
- American Standard Version (ASV)
- And he coupled five curtains one to another: and [the other] five curtains he coupled one to another.
- Bible in Basic English (BBE)
- And five curtains were joined together, and the other five curtains were joined together.
- Darby Translation (DBY)
- And he coupled five of the curtains one to another, and [the other] five curtains coupled he one to another.
- Webster's Bible (WBS)
- And he coupled the five curtains one to another: and [the other] five curtains he coupled one to another.
- Young's Literal Translation (YLT)
- And he joineth the five curtains one unto another, and the [other] five curtains he hath joined one unto another;
Read in context
- 8ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.
- 9ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే.
- 10అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.
- 11మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.
- 12ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.
Cross references
- Philippians 3:15 ఫిలిప్పీయులకు 3:15కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
- Ephesians 2:21–22 ఎఫెసీయులకు 2:21–22ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
- 1 Corinthians 12:20 1 కొరింథీయులకు 12:20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
- Ephesians 1:23 ఎఫెసీయులకు 1:23ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.
- Exodus 26:3 నిర్గమకాండము 26:3అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.
- Zephaniah 3:9 జెఫన్యా 3:9అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.
- 1 Corinthians 12:27 1 కొరింథీయులకు 12:27అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు
- Ephesians 4:2–6 ఎఫెసీయులకు 4:2–6మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
- Philippians 2:2 ఫిలిప్పీయులకు 2:2మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.
- 1 Corinthians 1:10 1 కొరింథీయులకు 1:10సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
- Psalm 122:3 కీర్తనలు 122:3యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
- Psalm 133:1 కీర్తనలు 133:1సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!