Ezekiel · chapter 10 · verse 18
Ezekiel 10:18 in Telugu
యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా
Yehovaa mahima mandirapu gadapa daggara nundi bayaluderi keroobulaku paitattuna niluvagaa
Ezekiel 10:18 in English
- King James Version (KJV)
- Then the glory of the LORD departed from off the threshold of the house, and stood over the cherubims.
- World English Bible (WEB)
- The LORD’s glory went out from over the threshold of the house and stood over the cherubim.
- American Standard Version (ASV)
- And the glory of Jehovah went forth from over the threshold of the house, and stood over the cherubim.
- Bible in Basic English (BBE)
- Then the glory of the Lord went out from the doorstep of the house, and came to rest over the winged ones.
- Darby Translation (DBY)
- And the glory of Jehovah departed from over the threshold of the house, and stood over the cherubim.
- Webster's Bible (WBS)
- Then the glory of the LORD departed from off the threshhold of the house, and stood over the cherubim.
- Young's Literal Translation (YLT)
- And go forth doth the honour of Jehovah from off the threshold of the house, and standeth over the cherubs,
Read in context
- 16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
- 17జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను
- 18యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా
- 19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- 20కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
Cross references
- Psalm 18:10 కీర్తనలు 18:10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- Psalm 78:60–61 కీర్తనలు 78:60–61షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
- Matthew 23:37–39 మత్తయి 23:37–39యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది ఇదిమొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.
- Genesis 3:24 ఆదికాండము 3:24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
- Jeremiah 7:12–14 యిర్మీయా 7:12–14పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
- 2 Kings 2:11 2 రాజులు 2:11వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
- Psalm 68:17–18 కీర్తనలు 68:17–18దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.
- Ezekiel 7:20–22 యెహెజ్కేలు 7:20–22శృంగార మైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధార ముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను, వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడ కుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్ర పరచుదురు.
- Hosea 9:12 హోషేయ 9:12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
- Jeremiah 6:8 యిర్మీయా 6:8యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.
- Ezekiel 10:3–4 యెహెజ్కేలు 10:3–4అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.