Ezekiel · chapter 10 · verse 15
Ezekiel 10:15 in Telugu
ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
Ee keroobulu paikekkenu. Kebaaru nadi daggara naaku kanabadina jantuvu ide.
Ezekiel 10:15 in English
- King James Version (KJV)
- And the cherubims were lifted up. This [is] the living creature that I saw by the river of Chebar.
- World English Bible (WEB)
- The cherubim mounted up. This is the living creature that I saw by the river Chebar.
- American Standard Version (ASV)
- And the cherubim mounted up: this is the living creature that I saw by the river Chebar.
- Bible in Basic English (BBE)
- And the winged ones went up on high: this is the living being which I saw by the river Chebar.
- Darby Translation (DBY)
- And the cherubim mounted up. This was the living creature that I saw by the river Chebar.
- Webster's Bible (WBS)
- And the cherubim were lifted up. This [is] the living creature that I saw by the river of Kebar.
- Young's Literal Translation (YLT)
- And the cherubs are lifted up, it [is] the living creature that I saw by the river Chebar.
Read in context
- 13నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.
- 14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
- 15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
- 16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
- 17జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను
Cross references
- Ezekiel 1:5 యెహెజ్కేలు 1:5దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.
- Ezekiel 8:6 యెహెజ్కేలు 8:6అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.
- Ezekiel 10:18–20 యెహెజ్కేలు 10:18–20యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
- Ezekiel 1:3 యెహెజ్కేలు 1:3యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.
- Hosea 9:12 హోషేయ 9:12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
- Ezekiel 1:13–14 యెహెజ్కేలు 1:13–14ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను.
- Ezekiel 11:22 యెహెజ్కేలు 11:22కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.
- Ezekiel 43:3 యెహెజ్కేలు 43:3నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కన బడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.