Ezekiel · chapter 27 · verse 15
Ezekiel 27:15 in Telugu
దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
Dadaanuvaarunu neeto vartaka vyaapaaramu cheyuduru, chaala dveepamula vartakamulu nee vashamuna nunnavi; vartakulu dantamunu kovidaaru mraanunu ichchi nee sarakulu konukkonduru.
Ezekiel 27:15 in English
- King James Version (KJV)
- The men of Dedan [were] thy merchants; many isles [were] the merchandise of thine hand: they brought thee [for] a present horns of ivory and ebony.
- World English Bible (WEB)
- “‘“The men of Dedan traded with you. Many islands were the market of your hand. They brought you horns of ivory and ebony in exchange.
- American Standard Version (ASV)
- The men of Dedan were thy traffickers; many isles were the mart of thy hand: they brought thee in exchange horns of ivory and ebony.
- Bible in Basic English (BBE)
- The men of Rodan were your traders: a great number of sea-lands did business with you: they gave you horns of ivory and ebony as an offering.
- Darby Translation (DBY)
- The children of Dedan were thy traffickers; many isles were the mart of thy hand: they rendered in payment horns of ivory, and ebony.
- Webster's Bible (WBS)
- The men of Dedan [were] thy merchants; many isles [were] the merchandise of thy hand: they brought thee [for] a present horns of ivory and ebony.
- Young's Literal Translation (YLT)
- Sons of Dedan [are] thy merchants, Many isles [are] the mart of thy hand, Horns of ivory and ebony they sent back thy reward.
Read in context
- 13గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
- 14తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;
- 15దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
- 16నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.
- 17మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిల మును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
Cross references
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
- Genesis 10:7 ఆదికాండము 10:7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
- Revelation 18:12 ప్రకటన 18:12ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను,
- Jeremiah 25:23 యిర్మీయా 25:23దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును
- Ezekiel 27:20 యెహెజ్కేలు 27:20దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
- Genesis 25:3 ఆదికాండము 25:3యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
- Ezekiel 25:13 యెహెజ్కేలు 25:13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
- 1 Chronicles 1:32 1 దినవృత్తాంతములు 1:32అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
- Jeremiah 49:8 యిర్మీయా 49:8ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.
- 1 Chronicles 1:9 1 దినవృత్తాంతములు 1:9కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.