Ezekiel · chapter 47 · verse 14
Ezekiel 47:14 in Telugu
నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
Nenu pramaanamuchesi mee pitarulaku ee deshamu ichchitini ganuka emiyu bhedamulekunda meelo prativaadunu daanilo svaasthyamunondunu; eelaaguna adi meeku svaasthyamagunu.
Ezekiel 47:14 in English
- King James Version (KJV)
- And ye shall inherit it, one as well as another: [concerning] the which I lifted up mine hand to give it unto your fathers: and this land shall fall unto you for inheritance.
- World English Bible (WEB)
- You shall inherit it, one as well as another; for I swore to give it to your fathers. This land will fall to you for inheritance.
- American Standard Version (ASV)
- And ye shall inherit it, one as well as another; for I sware to give it unto your fathers: and this land shall fall unto you for inheritance.
- Bible in Basic English (BBE)
- And you are to make an equal division of it; as I gave my oath to your fathers to give it to you: for this land is to be your heritage.
- Darby Translation (DBY)
- And ye shall inherit it, one as well as another, [the land] concerning which I lifted up my hand to give it unto your fathers; and this land shall fall to you for inheritance.
- Webster's Bible (WBS)
- And ye shall inherit it, one as well as another: [concerning] which I lifted up my hand to give it to your fathers: and this land shall fall to you for inheritance.
- Young's Literal Translation (YLT)
- And ye have inherited it, one as well as another, in that I have lifted up My hand to give it to your fathers; and this land hath fallen to you in inheritance.
Read in context
- 12నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.
- 13ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.
- 14నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
- 15ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
- 16అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.
Cross references
- Genesis 12:7 ఆదికాండము 12:7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
- Ezekiel 20:5–6 యెహెజ్కేలు 20:5–6ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.
- Ezekiel 48:29 యెహెజ్కేలు 48:29మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రము లకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
- Genesis 15:7 ఆదికాండము 15:7మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
- Genesis 13:15 ఆదికాండము 13:15ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
- Deuteronomy 1:8 ద్వితీయోపదేశకాండము 1:8ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
- Numbers 14:30 సంఖ్యాకాండము 14:30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
- Ezekiel 20:42 యెహెజ్కేలు 20:42మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
- Genesis 28:13 ఆదికాండము 28:13మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
- Ezekiel 20:28 యెహెజ్కేలు 20:28వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వక ముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరు వాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పిం చుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
- Numbers 14:16 సంఖ్యాకాండము 14:16ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
- Genesis 17:8 ఆదికాండము 17:8నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.