Ezekiel · chapter 7 · verse 25
Ezekiel 7:25 in Telugu
సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు.
Samooladhvansamu vachcheyunnadi, janulu samaadhaanamu koraku vichaarinchuchunnaarugaani adi vaariki dorakadu.
Ezekiel 7:25 in English
- King James Version (KJV)
- Destruction cometh; and they shall seek peace, and [there shall be] none.
- World English Bible (WEB)
- Destruction comes! They will seek peace, and there will be none.
- American Standard Version (ASV)
- Destruction cometh; and they shall seek peace, and there shall be none.
- Bible in Basic English (BBE)
- Shaking fear is coming; and they will be looking for peace, and there will be no peace.
- Darby Translation (DBY)
- Destruction cometh; and they shall seek peace, but there shall be none.
- Webster's Bible (WBS)
- Destruction cometh; and they shall seek peace, and [there shall be] none.
- Young's Literal Translation (YLT)
- Destruction hath come, And they have sought peace, and there is none.
Read in context
- 23దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండి యున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.
- 24బలాఢ్యుల యతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను; ఆ దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు.
- 25సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు.
- 26నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది; వారు ప్రవక్తయొద్ద దర్శనముకొరకు విచారణచేయుదురుగాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు.
- 27రాజు వ్యాకులపడు చున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నా నని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషము లను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.
Cross references
- Jeremiah 8:15–16 యిర్మీయా 8:15–16మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదా యెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.
- Isaiah 59:8–12 యెషయా 59:8–12శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.
- Lamentations 4:17–18 విలాపవాక్యములు 4:17–18వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి. రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది.
- Isaiah 57:21 యెషయా 57:21దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
- Ezekiel 13:10 యెహెజ్కేలు 13:10సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.
- Micah 1:12 మీకా 1:12మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.
- Ezekiel 13:16 యెహెజ్కేలు 13:16యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.