Galatians · chapter 4 · verse 24
Galatians 4:24 in Telugu
ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.
Ee sangatulu alankaara roopakamugaa cheppabadiyunnavi. Ee streelu rendu nibandhanalai yunnaaru; vaatilo okati seenaayi konda sambandhamainadai daasyamulo undutaku pillalu kanunu; idi haagaru.
Galatians 4:24 in English
- King James Version (KJV)
- Which things are an allegory: for these are the two covenants; the one from the mount Sinai, which gendereth to bondage, which is Agar.
- World English Bible (WEB)
- These things contain an allegory, for these are two covenants. One is from Mount Sinai, bearing children to bondage, which is Hagar.
- American Standard Version (ASV)
- Which things contain an allegory: for these [women] are two covenants; one from mount Sinai, bearing children unto bondage, which is Hagar.
- Bible in Basic English (BBE)
- Which things have a secret sense; because these women are the two agreements; one from the mountain of Sinai, giving birth to servants, which is Hagar.
- Darby Translation (DBY)
- Which things have an allegorical sense; for these are two covenants: one from mount Sinai, gendering to bondage, which is Hagar.
- Webster's Bible (WBS)
- Which things are an allegory: for these are the two covenants; the one from the mount Sinai, which gendereth to bondage, which is Agar.
- Young's Literal Translation (YLT)
- which things are allegorized, for these are the two covenants: one, indeed, from mount Sinai, to servitude bringing forth, which is Hagar;
Read in context
- 22దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
- 23అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దాన మునుబట్టి పుట్టెను.
- 24ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.
- 25ఈ హాగరు అనునది అరేబియాదేశములోఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.
- 26అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.
Cross references
- Genesis 21:9–13 ఆదికాండము 21:9–13అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.
- Hebrews 10:15–18 హెబ్రీయులకు 10:15–18ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చు చున్నాడు. ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.
- Matthew 13:35 మత్తయి 13:35అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Genesis 25:12 ఆదికాండము 25:12ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.
- Genesis 16:15–16 ఆదికాండము 16:15–16తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
- Hebrews 12:24 హెబ్రీయులకు 12:24క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
- Genesis 16:8 ఆదికాండము 16:8శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.
- 1 Corinthians 10:11 1 కొరింథీయులకు 10:11ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
- Hosea 11:10 హోషేయ 11:10వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.
- Hebrews 7:22 హెబ్రీయులకు 7:22ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
- Ezekiel 20:49 యెహెజ్కేలు 20:49అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢ మైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.
- Deuteronomy 33:2 ద్వితీయోపదేశకాండము 33:2శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను.
Original words (Greek)
- things · G3748ὅστις hóstis
- are · G2076ἐστί estí
- allegory · G238ἀλληγορέω allēgoréō
- for · G1063γάρ gár
- these · G3778οὗτος hoûtos
- are · G1526εἰσί eisí
- the · G1242διαθήκη diathḗkē
- two · G1417δύο dýo
- covenants · G1242διαθήκη diathḗkē
- one · G1520εἷς heîs
- from · G575ἀπό apó
- mount · G3735ὄρος óros
- Sinai · G4614Σινᾶ Sinâ
- gendereth · G1080γεννάω gennáō
- to · G1519εἰς eis
- bondage · G1397δουλεία douleía
- which · G3748ὅστις hóstis
- is · G2076ἐστί estí
- Agar · G28Ἄγαρ Ágar