Galatians · chapter 5 · verse 16
Galatians 5:16 in Telugu
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
Nenu cheppunademanagaa aatmaanusaaramugaa naduchu konudi, appudu meeru shareerechchhanu neravercharu.
Galatians 5:16 in English
- King James Version (KJV)
- [This] I say then, Walk in the Spirit, and ye shall not fulfil the lust of the flesh.
- World English Bible (WEB)
- But I say, walk by the Spirit, and you won’t fulfill the lust of the flesh.
- American Standard Version (ASV)
- But I say, Walk by the Spirit, and ye shall not fulfil the lust of the flesh.
- Bible in Basic English (BBE)
- But I say, Go on in the Spirit, and you will not come under the rule of the evil desires of the flesh.
- Darby Translation (DBY)
- But I say, Walk in [the] Spirit, and ye shall no way fulfil flesh's lust.
- Webster's Bible (WBS)
- [This] I say then, Walk in the Spirit, and ye will not fulfill the lust of the flesh.
- Young's Literal Translation (YLT)
- And I say: In the Spirit walk ye, and the desire of the flesh ye may not complete;
Read in context
- 14ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
- 15అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.
- 16నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
- 17శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
- 18మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మ శాస్త్రమునకు లోనైనవారు కారు.
Cross references
- Galatians 5:24–25 గలతీయులకు 5:24–25క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.
- Romans 8:12–14 రోమీయులకు 8:12–14కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
- Galatians 6:8 గలతీయులకు 6:8ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
- Galatians 5:19–21 గలతీయులకు 5:19–21శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
- Colossians 3:5–10 కొలొస్సయులకు 3:5–10కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
- Romans 8:4–5 రోమీయులకు 8:4–5దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
- 1 John 2:15–16 1 యోహాను 2:15–16ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
- 1 Peter 2:11 1 పేతురు 2:11ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
- 2 Corinthians 7:1 2 కొరింథీయులకు 7:1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- Romans 13:13–14 రోమీయులకు 13:13–14అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.
- Romans 6:12 రోమీయులకు 6:12కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
- Jude 1:19–21 యూదా 1:19–21అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.