Galatians · chapter 6 · verse 2
Galatians 6:2 in Telugu
ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెర వేర్చుడి.
Okani bhaaramula nokadubharinchi, yeelaagu kreestu niyamamunu poortigaa nera verchudi.
Galatians 6:2 in English
- King James Version (KJV)
- Bear ye one another’s burdens, and so fulfil the law of Christ.
- World English Bible (WEB)
- Bear one another’s burdens, and so fulfill the law of Christ.
- American Standard Version (ASV)
- Bear ye one another’s burdens, and so fulfil the law of Christ.
- Bible in Basic English (BBE)
- Take on yourselves one another's troubles, and so keep the law of Christ.
- Darby Translation (DBY)
- Bear one another's burdens, and thus fulfil the law of the Christ.
- Webster's Bible (WBS)
- Bear ye one another's burdens, and so fulfill the law of Christ.
- Young's Literal Translation (YLT)
- of one another the burdens bear ye, and so fill up the law of the Christ,
Read in context
- 1సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచు కొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.
- 2ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెర వేర్చుడి.
- 3ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును.
- 4ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.
Cross references
- Romans 15:1 రోమీయులకు 15:1కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
- 1 Thessalonians 5:14 1 థెస్సలొనీకయులకు 5:14సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
- John 13:34 యోహాను 13:34మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
- 1 John 4:21 1 యోహాను 4:21దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
- James 2:8 యాకోబు 2:8మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.
- John 15:12 యోహాను 15:12నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
- Galatians 5:13–14 గలతీయులకు 5:13–14సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
- John 13:14–15 యోహాను 13:14–15కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
- Exodus 23:5 నిర్గమకాండము 23:5నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
- 1 John 2:8–11 1 యోహాను 2:8–11మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
- 1 Peter 2:24 1 పేతురు 2:24మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
- Matthew 11:29–30 మత్తయి 11:29–30నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.