Genesis · chapter 10 · verse 22
Genesis 10:22 in Telugu
షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
Shemu kumaarulu elaamu ashshooru arpakshadu loodu araamanu vaaru.
Genesis 10:22 in English
- King James Version (KJV)
- The children of Shem; Elam, and Asshur, and Arphaxad, and Lud, and Aram.
- World English Bible (WEB)
- The sons of Shem were: Elam, Asshur, Arpachshad, Lud, and Aram.
- American Standard Version (ASV)
- The sons of Shem: Elam, and Asshur, and Arpachshad, and Lud, and Aram.
- Bible in Basic English (BBE)
- These are the sons of Shem: Elam and Asshur and Arpachshad and Lud and Aram.
- Darby Translation (DBY)
- The sons of Shem: Elam, and Asshur, and Arphaxad, and Lud, and Aram.
- Webster's Bible (WBS)
- The children of Shem; Elam, and Ashur, and Arphaxad, and Lud, and Aram.
- Young's Literal Translation (YLT)
- Sons of Shem [are] Elam, and Asshur, and Arphaxad, and Lud, and Aram.
Read in context
- 20వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
- 21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- 22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- 23అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు.
- 24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
Cross references
- Isaiah 66:19 యెషయా 66:19నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.
- Isaiah 21:2 యెషయా 21:2కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.
- 1 Chronicles 1:17–27 1 దినవృత్తాంతములు 1:17–27షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లానును ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు,
- Genesis 14:1–9 ఆదికాండము 14:1–9షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
- Jeremiah 25:25 యిర్మీయా 25:25జిమీ రాజు లందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
- Genesis 9:26 ఆదికాండము 9:26మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
- Isaiah 11:11 యెషయా 11:11ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
- Isaiah 22:6 యెషయా 22:6ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరుడాలు పై గవిసెన తీసెను
- Numbers 23:7 సంఖ్యాకాండము 23:7అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
- Acts 2:9 అపొస్తలుల కార్యములు 2:9పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,
- Jeremiah 49:34–39 యిర్మీయా 49:34–39యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను. నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చువాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు. మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
- 2 Kings 15:19 2 రాజులు 15:19అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.