Genesis · chapter 12 · verse 6
Genesis 12:6 in Telugu
అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలము దాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.
Appudu abraamu shekemunandali yoka sthalamu daaka aa desha sanchaaramuchesi more daggara nunna sindhooravrukshamu noddaku cherenu. Appudu kanaaneeyulu aa deshamulo nivasinchiri.
Genesis 12:6 in English
- King James Version (KJV)
- And Abram passed through the land unto the place of Sichem, unto the plain of Moreh. And the Canaanite [was] then in the land.
- World English Bible (WEB)
- Abram passed through the land to the place of Shechem, to the oak of Moreh. At that time, Canaanites were in the land.
- American Standard Version (ASV)
- And Abram passed through the land unto the place of Shechem, unto the oak of Moreh. And the Canaanite was then in the land.
- Bible in Basic English (BBE)
- And Abram went through the land till he came to Shechem, to the holy tree of Moreh. At that time, the Canaanites were still living in the land.
- Darby Translation (DBY)
- And Abram passed through the land to the place of Shechem, to the oak of Moreh. And the Canaanite was then in the land.
- Webster's Bible (WBS)
- And Abram passed through the land to the place of Sichem, to the plain of Moreh. And the Canaanite [was] then in the land.
- Young's Literal Translation (YLT)
- And Abram passeth over into the land, unto the place Shechem, unto the oak of Moreh; and the Canaanite [is] then in the land.
Read in context
- 4యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
- 5అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి.
- 6అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలము దాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.
- 7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
- 8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
Cross references
- Hebrews 11:9 హెబ్రీయులకు 11:9విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
- Deuteronomy 11:30 ద్వితీయోపదేశకాండము 11:30అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
- Genesis 13:7 ఆదికాండము 13:7అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.
- Genesis 35:4 ఆదికాండము 35:4వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.
- Genesis 15:18–21 ఆదికాండము 15:18–21ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
- Genesis 10:18–19 ఆదికాండము 10:18–19తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
- Judges 7:1 న్యాయాధిపతులు 7:1అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
- Joshua 24:32 యెహోషువ 24:32ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
- Genesis 34:2 ఆదికాండము 34:2ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.
- 1 Kings 12:1 1 రాజులు 12:1రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను.
- Judges 9:1 న్యాయాధిపతులు 9:1యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారి తోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను
- John 4:5 యోహాను 4:5యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.