Genesis · chapter 16 · verse 9
Genesis 16:9 in Telugu
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.
Appudu yehovaa doota nee yajamaanuraali yoddaku tirigi velli aame cheti krinda anigi yundumani daanito cheppenu.
Genesis 16:9 in English
- King James Version (KJV)
- And the angel of the LORD said unto her, Return to thy mistress, and submit thyself under her hands.
- World English Bible (WEB)
- The LORD’s angel said to her, “Return to your mistress, and submit yourself under her hands.”
- American Standard Version (ASV)
- And the angel of Jehovah said unto her, Return to thy mistress, and submit thyself under her hands.
- Bible in Basic English (BBE)
- And the angel said to her, Go back, and put yourself under her authority.
- Darby Translation (DBY)
- And the Angel of Jehovah said to her, Return to thy mistress, and submit thyself under her hands.
- Webster's Bible (WBS)
- And the angel of the LORD said to her, Return to thy mistress, and submit thyself under her hands.
- Young's Literal Translation (YLT)
- And the messenger of Jehovah saith to her, 'Turn back unto thy mistress, and humble thyself under her hands;'
Read in context
- 7యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
- 8శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.
- 9అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.
- 10మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
- 11మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
Cross references
- Titus 2:9 తీతుకు 2:9దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,
- 1 Peter 5:5–6 1 పేతురు 5:5–6చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
- Ecclesiastes 10:4 ప్రసంగి 10:4ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.
- 1 Peter 2:18–25 1 పేతురు 2:18–25పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
- Ephesians 6:5–6 ఎఫెసీయులకు 6:5–6దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి. మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు,
- Ephesians 5:21 ఎఫెసీయులకు 5:21క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.