Genesis · chapter 18 · verse 12
Genesis 18:12 in Telugu
శారా - నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
Shaaraa - nenu balamu udigina daananaina taruvaata naaku sukhamu kalugunaa? Naa yajamaanudunu vruddhudai yunnaadu gadaa ani tanalo navvukonenu.
Genesis 18:12 in English
- King James Version (KJV)
- Therefore Sarah laughed within herself, saying, After I am waxed old shall I have pleasure, my lord being old also?
- World English Bible (WEB)
- Sarah laughed within herself, saying, “After I have grown old will I have pleasure, my lord being old also?”
- American Standard Version (ASV)
- And Sarah laughed within herself, saying, After I am waxed old shall I have pleasure, my lord being old also?
- Bible in Basic English (BBE)
- And Sarah, laughing to herself, said, Now that I am used up am I still to have pleasure, my husband himself being old?
- Darby Translation (DBY)
- And Sarah laughed within herself, saying, After I am become old, shall I have pleasure, and my lord old?
- Webster's Bible (WBS)
- Therefore Sarah laughed within herself, saying, After I am become old shall I have pleasure, my lord being old also?
- Young's Literal Translation (YLT)
- and Abraham and Sarah [are] aged, entering into days — the way of women hath ceased to be to Sarah;
Read in context
- 10అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
- 11అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక
- 12శారా - నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
- 13అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
- 14యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
Cross references
- 1 Peter 3:6 1 పేతురు 3:6ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
- Genesis 17:17 ఆదికాండము 17:17అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి - నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.
- Luke 1:18–20 లూకా 1:18–20జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
- Genesis 21:6–7 ఆదికాండము 21:6–7అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.
- Luke 1:34–35 లూకా 1:34–35అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
- Genesis 18:13 ఆదికాండము 18:13అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
- Ephesians 5:33 ఎఫెసీయులకు 5:33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
- Psalm 126:2 కీర్తనలు 126:2మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
- Hebrews 11:11–12 హెబ్రీయులకు 11:11–12విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.