Genesis · chapter 20 · verse 17
Genesis 20:17 in Telugu
అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
Abraahaamu devuni praarthimpagaa devudu abeemelekunu atani bhaaryanu atani daaseelanu baaguchesenu; vaaru pillalu kaniri.
Genesis 20:17 in English
- King James Version (KJV)
- So Abraham prayed unto God: and God healed Abimelech, and his wife, and his maidservants; and they bare [children].
- World English Bible (WEB)
- Abraham prayed to God. So God healed Abimelech, his wife, and his female servants, and they bore children.
- American Standard Version (ASV)
- And Abraham prayed unto God: and God healed Abimelech, and his wife, and his maid-servants; and they bare children.
- Bible in Basic English (BBE)
- Then Abraham made prayer to God, and God made Abimelech well again, and his wife and his women-servants, so that they had children.
- Darby Translation (DBY)
- And Abraham prayed to God, and God healed Abimelech, and his wife and his handmaids, and they bore [children].
- Webster's Bible (WBS)
- So Abraham prayed to God: and God healed Abimelech, and his wife, and his maid-servants, and they bore [children].
- Young's Literal Translation (YLT)
- And Abraham prayeth unto God, and God healeth Abimelech and his wife, and his handmaids, and they bear:
Read in context
- 15అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.
- 16మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.
- 17అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
- 18ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.
Cross references
- James 5:16 యాకోబు 5:16మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- Job 42:9–10 యోబు 42:9–10తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
- Matthew 21:22 మత్తయి 21:22మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
- 1 Thessalonians 5:25 1 థెస్సలొనీకయులకు 5:25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
- Proverbs 15:8 సామెతలు 15:8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- Isaiah 45:11 యెషయా 45:11ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?
- 1 Samuel 5:11–12 1 సమూయేలు 5:11–12కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించిఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జను లను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను. చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.
- Matthew 7:7 మత్తయి 7:7అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
- Ezra 6:10 ఎజ్రా 6:10వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.
- Genesis 20:7 ఆదికాండము 20:7కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
- Genesis 29:31 ఆదికాండము 29:31లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.