Genesis · chapter 4 · verse 10
Genesis 4:10 in Telugu
అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.
Appudaayana neevu chesinapani yemiti? Nee tammuni raktamu yokka svaramu nelalo nundi naaku morapettuchunnadi.
Genesis 4:10 in English
- King James Version (KJV)
- And he said, What hast thou done? the voice of thy brother’s blood crieth unto me from the ground.
- World English Bible (WEB)
- The LORD said, “What have you done? The voice of your brother’s blood cries to me from the ground.
- American Standard Version (ASV)
- And he said, What hast thou done? the voice of thy brother’s blood crieth unto me from the ground.
- Bible in Basic English (BBE)
- And he said, What have you done? the voice of your brother's blood is crying to me from the earth.
- Darby Translation (DBY)
- And he said, What hast thou done? the voice of thy brother's blood is crying to me from the ground.
- Webster's Bible (WBS)
- And he said, What hast thou done? the voice of thy brother's blood crieth to me from the ground.
- Young's Literal Translation (YLT)
- And He saith, 'What hast thou done? the voice of thy brother's blood is crying unto Me from the ground;
Read in context
- 8కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.
- 9యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
- 10అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.
- 11కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు;
- 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
Cross references
- Hebrews 12:24 హెబ్రీయులకు 12:24క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
- Hebrews 11:4 హెబ్రీయులకు 11:4విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
- Psalm 72:14 కీర్తనలు 72:14కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
- Isaiah 5:7 యెషయా 5:7ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
- James 5:4 యాకోబు 5:4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Psalm 9:12 కీర్తనలు 9:12ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనునువారి మొఱ్ఱను ఆయన మరువడు.
- Revelation 6:9–10 ప్రకటన 6:9–10ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
- Numbers 35:33 సంఖ్యాకాండము 35:33మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- Job 31:38–39 యోబు 31:38–39నా భూమి నామీద మొఱ్ఱపెట్టిన యెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను
- Job 16:18 యోబు 16:18భూమీ, నా రక్తమును కప్పివేయకుము నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.
- Genesis 9:5 ఆదికాండము 9:5మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
- Exodus 3:7 నిర్గమకాండము 3:7మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.