Genesis · chapter 4 · verse 11
Genesis 4:11 in Telugu
కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు;
Kaavuna nee tammuni raktamunu nee chetilo nundi puchchukonutaku noru terachina yee nelameeda undakunda, neevu shapimpabadinavaadavu;
Genesis 4:11 in English
- King James Version (KJV)
- And now [art] thou cursed from the earth, which hath opened her mouth to receive thy brother’s blood from thy hand;
- World English Bible (WEB)
- Now you are cursed because of the ground, which has opened its mouth to receive your brother’s blood from your hand.
- American Standard Version (ASV)
- And now cursed art thou from the ground, which hath opened its mouth to receive thy brother’s blood from thy hand;
- Bible in Basic English (BBE)
- And now you are cursed from the earth, whose mouth is open to take your brother's blood from your hand;
- Darby Translation (DBY)
- And now be thou cursed from the ground, which hath opened its mouth to receive thy brother's blood from thy hand.
- Webster's Bible (WBS)
- And now [art] thou cursed from the earth, which hath opened her mouth to receive thy brother's blood from thy hand;
- Young's Literal Translation (YLT)
- and now, cursed [art] thou from the ground, which hath opened her mouth to receive the blood of thy brother from thy hand;
Read in context
- 9యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
- 10అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.
- 11కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు;
- 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
- 13అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
Cross references
- Galatians 3:10 గలతీయులకు 3:10ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
- Job 16:18 యోబు 16:18భూమీ, నా రక్తమును కప్పివేయకుము నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.
- Deuteronomy 28:15–20 ద్వితీయోపదేశకాండము 28:15–20నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.
- Genesis 3:14 ఆదికాండము 3:14అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు
- Job 31:38–40 యోబు 31:38–40నా భూమి నామీద మొఱ్ఱపెట్టిన యెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
- Genesis 4:14 ఆదికాండము 4:14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.
- Deuteronomy 29:19–21 ద్వితీయోపదేశకాండము 29:19–21అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును.
- Revelation 12:16 ప్రకటన 12:16భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
- Isaiah 26:21 యెషయా 26:21నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.
- Deuteronomy 27:16–26 ద్వితీయోపదేశకాండము 27:16–26తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అన వలెను. తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాప గ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.