Genesis · chapter 48 · verse 10
Genesis 48:10 in Telugu
ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.
Ishraayelu kannulu vruddhaapyamuvalana mandamugaa undenu ganuka atadu choodaleka poyenu. Yosepu vaarini atani daggaraku teesikonivachchinappudu atadu vaarini muddu pettukoni kaugilinchukonenu.
Genesis 48:10 in English
- King James Version (KJV)
- Now the eyes of Israel were dim for age, [so that] he could not see. And he brought them near unto him; and he kissed them, and embraced them.
- World English Bible (WEB)
- Now the eyes of Israel were dim for age, so that he couldn’t see well. Joseph brought them near to him; and he kissed them, and embraced them.
- American Standard Version (ASV)
- Now the eyes of Israel were dim for age, so that he could not see. And he brought them near unto him; and he kissed them, and embraced them.
- Bible in Basic English (BBE)
- Now because Israel was old, his eyes were no longer clear, and he was not able to see. So he made them come near to him, and he gave them a kiss, folding them in his arms.
- Darby Translation (DBY)
- But the eyes of Israel were heavy from age: he could not see. And he brought them nearer to him; and he kissed them, and embraced them.
- Webster's Bible (WBS)
- (Now the eyes of Israel were dim for age, [so that] he could not see:) And he brought them near to him; and he kissed them, and embraced them.
- Young's Literal Translation (YLT)
- And the eyes of Israel have been heavy from age, he is unable to see; and he bringeth them nigh unto him, and he kisseth them, and cleaveth to them;
Read in context
- 8ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి - వీరెవరని అడుగగా
- 9యోసేపు - వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు - నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.
- 10ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.
- 11ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా
- 12యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.
Cross references
- Genesis 27:27 ఆదికాండము 27:27అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.
- Genesis 27:1 ఆదికాండము 27:1ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.
- Genesis 45:15 ఆదికాండము 45:15అతడు తన సహోదరులందరిని ముద్దుపెట్టుకొని వారిమీద పడియేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
- Genesis 31:55 ఆదికాండము 31:55తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.
- 1 Samuel 3:2 1 సమూయేలు 3:2ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను
- 1 Samuel 4:15 1 సమూయేలు 4:15ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.
- Isaiah 6:10 యెషయా 6:10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Isaiah 59:1 యెషయా 59:1రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
- 1 Kings 19:20 1 రాజులు 19:20అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తినేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడుపోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.