Genesis · chapter 5 · verse 3
Genesis 5:3 in Telugu
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
Aadaamu noota muppadi yendlu bradiki tana polikegaa tana svaroopamuna kumaaruni kani ataniki shetu anu peru pettenu.
Genesis 5:3 in English
- King James Version (KJV)
- And Adam lived an hundred and thirty years, and begat [a son] in his own likeness, after his image; and called his name Seth:
- World English Bible (WEB)
- Adam lived one hundred thirty years, and became the father of a son in his own likeness, after his image, and named him Seth.
- American Standard Version (ASV)
- And Adam lived a hundred and thirty years, and begat [a son] in his own likeness, after his image; and called his name Seth:
- Bible in Basic English (BBE)
- Adam had been living for a hundred and thirty years when he had a son like himself, after his image, and gave him the name of Seth:
- Darby Translation (DBY)
- And Adam lived a hundred and thirty years, and begot [a son] in his likeness, after his image, and called his name Seth.
- Webster's Bible (WBS)
- And Adam lived a hundred and thirty years, and begat [a son] in his own likeness, after his image; and called his name Seth:
- Young's Literal Translation (YLT)
- And Adam liveth an hundred and thirty years, and begetteth [a son] in his likeness, according to his image, and calleth his name Seth.
Read in context
- 1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- 2మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
- 3ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- 4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
- 5ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Cross references
- Genesis 4:25 ఆదికాండము 4:25ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- Job 14:4 యోబు 14:4పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.
- Luke 1:35 లూకా 1:35దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
- Psalm 14:2–3 కీర్తనలు 14:2–3వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
- Job 15:14–16 యోబు 15:14–16శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.
- Romans 5:12 రోమీయులకు 5:12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
- 1 Corinthians 15:39 1 కొరింథీయులకు 15:39మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.
- Ephesians 2:3 ఎఫెసీయులకు 2:3వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
- John 3:6 యోహాను 3:6శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
- Job 25:4 యోబు 25:4నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
- Psalm 51:5 కీర్తనలు 51:5నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.