Genesis · chapter 9 · verse 22
Genesis 9:22 in Telugu
అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
Appudu kanaanuku tandriyaina haamu tana tandri vastraheenudai yunduta choochi bayatanunna tana yiddaru sahodarulaku aa sangati telipenu.
Genesis 9:22 in English
- King James Version (KJV)
- And Ham, the father of Canaan, saw the nakedness of his father, and told his two brethren without.
- World English Bible (WEB)
- Ham, the father of Canaan, saw the nakedness of his father, and told his two brothers outside.
- American Standard Version (ASV)
- And Ham, the father of Canaan, saw the nakedness of his father, and told his two brethren without.
- Bible in Basic English (BBE)
- And Ham, the father of Canaan, saw his father unclothed, and gave news of it to his two brothers outside.
- Darby Translation (DBY)
- And Ham the father of Canaan saw the nakedness of his father, and told his two brethren outside.
- Webster's Bible (WBS)
- And Ham, the father of Canaan, saw the nakedness of his father, and told his two brethren without.
- Young's Literal Translation (YLT)
- And Ham, father of Canaan, seeth the nakedness of his father, and declareth to his two brethren without.
Read in context
- 20నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
- 21పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
- 22అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
- 23అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
- 24అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని -
Cross references
- Proverbs 30:17 సామెతలు 30:17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
- Galatians 6:1 గలతీయులకు 6:1సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచు కొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.
- 1 Corinthians 13:6 1 కొరింథీయులకు 13:6దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
- Matthew 18:15 మత్తయి 18:15మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.
- Psalm 40:15 కీర్తనలు 40:15నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
- Genesis 10:15–19 ఆదికాండము 10:15–19కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
- Psalm 70:3 కీర్తనలు 70:3ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందు దురుగాక
- Genesis 10:6 ఆదికాండము 10:6హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
- Obadiah 1:12–13 ఓబద్యా 1:12–13నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు; నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;
- 2 Samuel 1:19–20 2 సమూయేలు 1:19–20ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.
- Psalm 35:20–21 కీర్తనలు 35:20–21వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.
- 1 Chronicles 1:13–16 1 దినవృత్తాంతములు 1:13–16కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.