1 Chronicles · chapter 1 · verse 13
1 Chronicles 1:13 in Telugu
కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
Kanaanu tana jyeshthakumaarudaina seedonunu hetunu kanenu.
1 Chronicles 1:13 in English
- King James Version (KJV)
- And Canaan begat Zidon his firstborn, and Heth,
- World English Bible (WEB)
- Canaan became the father of Sidon his firstborn, Heth,
- American Standard Version (ASV)
- And Canaan begat Sidon his first-born, and Heth,
- Bible in Basic English (BBE)
- And Canaan was the father of Zidon, his oldest son, and Heth,
- Darby Translation (DBY)
- — And Canaan begot Zidon his firstborn, and Heth,
- Webster's Bible (WBS)
- And Canaan begat Zidon his first-born, and Heth,
- Young's Literal Translation (YLT)
- And Canaan begat Zidon his first born, and Heth,
Read in context
- 11లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
- 12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
- 13కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
- 14యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
- 15హివ్వీయులు అర్కీయులు సీనీయులు
Cross references
- Genesis 10:15–19 ఆదికాండము 10:15–19కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
- Genesis 9:25–26 ఆదికాండము 9:25–26కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
- Genesis 9:22 ఆదికాండము 9:22అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
- Genesis 23:3 ఆదికాండము 23:3తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి
- Exodus 23:28 నిర్గమకాండము 23:28మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.
- 2 Samuel 11:6 2 సమూయేలు 11:6దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.
- Genesis 49:30–32 ఆదికాండము 49:30–32హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనెను.
- Genesis 23:20 ఆదికాండము 23:20ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
- Genesis 27:46 ఆదికాండము 27:46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
- Joshua 9:1 యెహోషువ 9:1యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు
- Genesis 23:5 ఆదికాండము 23:5హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;