Hebrews · chapter 3 · verse 9
Hebrews 3:9 in Telugu
నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
Naluvadi sanvatsaramulu naa kaaryamulanu choochi mee pitarulu nannu pareekshinchi shodhinchiri.
Hebrews 3:9 in English
- King James Version (KJV)
- When your fathers tempted me, proved me, and saw my works forty years.
- World English Bible (WEB)
- where your fathers tested me and tried me, and saw my deeds for forty years.
- American Standard Version (ASV)
- Where your fathers tried [me] by proving [me], And saw my works forty years.
- Bible in Basic English (BBE)
- When your fathers put me to the test, and saw my works for forty years.
- Darby Translation (DBY)
- where your fathers tempted [me], by proving [me], and saw my works forty years.
- Webster's Bible (WBS)
- When your fathers tempted me, proved me, and saw my works forty years.
- Young's Literal Translation (YLT)
- in which tempt Me did your fathers, they did prove Me, and saw My works forty years;
Read in context
- 7మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు.
- 8నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
- 9నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
- 10కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
- 11గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
Cross references
- Acts 7:36 అపొస్తలుల కార్యములు 7:36ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
- Deuteronomy 4:9 ద్వితీయోపదేశకాండము 4:9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
- Exodus 19:4 నిర్గమకాండము 19:4నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.
- Deuteronomy 8:4 ద్వితీయోపదేశకాండము 8:4ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
- Deuteronomy 4:3 ద్వితీయోపదేశకాండము 4:3బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.
- Amos 2:10 ఆమోసు 2:10మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
- Acts 13:8 అపొస్తలుల కార్యములు 13:8అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
- Deuteronomy 8:2 ద్వితీయోపదేశకాండము 8:2మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.
- Joshua 24:7 యెహోషువ 24:7వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.
- Luke 7:22 లూకా 7:22అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది;
- Joshua 23:3 యెహోషువ 23:3మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహో వాయే.
- Deuteronomy 29:2 ద్వితీయోపదేశకాండము 29:2మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా