Hebrews · chapter 9 · verse 18
Hebrews 9:18 in Telugu
ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
Inducheta modati nibandhanakooda raktamulekunda pratishthimpabadaledu.
Hebrews 9:18 in English
- King James Version (KJV)
- Whereupon neither the first [testament] was dedicated without blood.
- World English Bible (WEB)
- Therefore even the first covenant has not been dedicated without blood.
- American Standard Version (ASV)
- Wherefore even the first [covenant] hath not been dedicated without blood.
- Bible in Basic English (BBE)
- So that even the first agreement was not made without blood.
- Darby Translation (DBY)
- Whence neither the first was inaugurated without blood.
- Webster's Bible (WBS)
- Hence even the first [testament] was not dedicated without blood.
- Young's Literal Translation (YLT)
- whence not even the first apart from blood hath been initiated,
Read in context
- 16మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
- 17ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
- 18ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
- 19ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని
- 20దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
Cross references
- Exodus 24:3–8 నిర్గమకాండము 24:3–8మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో ¸యౌవనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.
- Hebrews 8:7–9 హెబ్రీయులకు 8:7–9ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగావారు - వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
- Hebrews 9:14 హెబ్రీయులకు 9:14నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
- Hebrews 9:22 హెబ్రీయులకు 9:22మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
- Exodus 12:22 నిర్గమకాండము 12:22మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.