Hosea · chapter 11 · verse 7
Hosea 11:7 in Telugu
నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవ డును యత్నము చేయడు
Nannu visarjinchavalenani naa janulu teermaanamu chesikoniyunnaaru; mahonnatuni tattu choodavalenani pravaktalu pilichinanu choochutaku eva dunu yatnamu cheyadu
Hosea 11:7 in English
- King James Version (KJV)
- And my people are bent to backsliding from me: though they called them to the most High, none at all would exalt [him].
- World English Bible (WEB)
- My people are determined to turn from me. Though they call to the Most High, he certainly won’t exalt them.
- American Standard Version (ASV)
- And my people are bent on backsliding from me: though they call them to [him that is] on high, none at all will exalt [him].
- Bible in Basic English (BBE)
- My people are given up to sinning against me; though their voice goes up on high, no one will be lifting them up.
- Darby Translation (DBY)
- Yea, my people are bent upon backsliding from me: though they call them to the Most High, none at all exalteth [him].
- Webster's Bible (WBS)
- And my people are bent to backsliding from me: though they called them to the most High, none at all would exalt [him] .
- Young's Literal Translation (YLT)
- And My people are hanging in suspense, about My returning, And unto the Most High they do call, Together they exalt not.
Read in context
- 5ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును.
- 6వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణము లను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.
- 7నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవ డును యత్నము చేయడు
- 8ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.
- 9నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
Cross references
- Jeremiah 8:5 యిర్మీయా 8:5యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగిరామని యేల చెప్పుచున్నారు?
- Hosea 14:4 హోషేయ 14:4వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.
- Amos 5:4–6 ఆమోసు 5:4–6ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్‌గా లులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును.
- Amos 5:14–15 ఆమోసు 5:14–15మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.
- Jeremiah 3:11 యిర్మీయా 3:11కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.
- Hosea 7:16 హోషేయ 7:16వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
- Psalm 81:11 కీర్తనలు 81:11అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.
- Jeremiah 3:6–8 యిర్మీయా 3:6–8మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను. ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.
- Psalm 78:57–58 కీర్తనలు 78:57–58తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి. వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
- Proverbs 14:14 సామెతలు 14:14భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
- Jeremiah 14:7 యిర్మీయా 14:7యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
- Hosea 4:16 హోషేయ 4:16పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱె పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.