Proverbs · chapter 18 · verse 12
Proverbs 18:12 in Telugu
ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
Aapattu raakamunupu naruni hrudayamu atishaya padunu ghanataku mundu vinayamundunu.
Proverbs 18:12 in English
- King James Version (KJV)
- Before destruction the heart of man is haughty, and before honour [is] humility.
- World English Bible (WEB)
- Before destruction the heart of man is proud, but before honor is humility.
- American Standard Version (ASV)
- Before destruction the heart of man is haughty; And before honor [goeth] humility.
- Bible in Basic English (BBE)
- Before destruction the heart of man is full of pride, and before honour goes a gentle spirit.
- Darby Translation (DBY)
- Before destruction the heart of man is haughty; and before honour [goeth] humility.
- Webster's Bible (WBS)
- Before destruction the heart of man is haughty, and before honor [is] humility.
- Young's Literal Translation (YLT)
- Before destruction the heart of man is high, And before honour [is] humility.
Read in context
- 10యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
- 11ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
- 12ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
- 13సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
- 14నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
Cross references
- Proverbs 15:33 సామెతలు 15:33యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
- 1 Peter 5:5 1 పేతురు 5:5చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
- Ezekiel 28:2 యెహెజ్కేలు 28:2నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవైనే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, ఒ నీకు మర్మమైనదేదియు లేదు.
- Proverbs 11:2 సామెతలు 11:2అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
- Proverbs 16:18 సామెతలు 16:18నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
- Luke 14:11 లూకా 14:11తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
- Proverbs 29:23 సామెతలు 29:23ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
- Ezekiel 28:9 యెహెజ్కేలు 28:9నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
- Acts 12:21–23 అపొస్తలుల కార్యములు 12:21–23నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
- Daniel 9:23 దానియేలు 9:23నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించి నప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము.
- Daniel 9:20 దానియేలు 9:20నేను ఇంక పలుకుచు ప్రార్థనచేయుచు, పవిత్ర పర్వతముకొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.
- Ezekiel 16:49–50 యెహెజ్కేలు 16:49–50నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.