Hosea · chapter 9 · verse 11
Hosea 9:11 in Telugu
ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
Ephraayimuyokka keerti pakshivale egiri povunu; jananamainanu, garbhamuto undutayainanu, garbhamu dharinchutayainanu vaarikundadu.
Hosea 9:11 in English
- King James Version (KJV)
- [As for] Ephraim, their glory shall fly away like a bird, from the birth, and from the womb, and from the conception.
- World English Bible (WEB)
- As for Ephraim, their glory will fly away like a bird. There will be no birth, no one with child, and no conception.
- American Standard Version (ASV)
- As for Ephraim, their glory shall fly away like a bird: there shall be no birth, and none with child, and no conception.
- Bible in Basic English (BBE)
- As for Ephraim, their glory will go in flight like a bird: there will be no birth and no one with child and no giving of life.
- Darby Translation (DBY)
- As for Ephraim, their glory shall fly away as a bird, — no birth, no pregnancy, no conception!
- Webster's Bible (WBS)
- [As for] Ephraim, their glory shall fly away like a bird, from the birth, and from the womb, and from the conception.
- Young's Literal Translation (YLT)
- Ephraim [is] as a fowl, Fly away doth their honour, without birth, And without womb, and without conception.
Read in context
- 9గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.
- 10అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.
- 11ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
- 12వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
- 13లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.
Cross references
- Deuteronomy 28:18 ద్వితీయోపదేశకాండము 28:18నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
- Hosea 4:7 హోషేయ 4:7తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.
- Genesis 41:52 ఆదికాండము 41:52తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
- Hosea 10:5 హోషేయ 10:5బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.
- Hosea 9:14 హోషేయ 9:14యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.
- Job 18:5 యోబు 18:5భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
- Genesis 48:16–20 ఆదికాండము 48:16–20అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.
- Deuteronomy 33:17 ద్వితీయోపదేశకాండము 33:17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
- Ecclesiastes 6:3 ప్రసంగి 6:3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను
- Psalm 58:8 కీర్తనలు 58:8వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
- Job 18:18–19 యోబు 18:18–19జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు.
- Luke 23:29 లూకా 23:29ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.