Isaiah · chapter 10 · verse 9
Isaiah 10:9 in Telugu
కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
Kalno karkemeeshuvale nundaledaa? Hamaatu arpaaduvale nundaledaa? Shomronu damaskuvale nundaledaa?
Isaiah 10:9 in English
- King James Version (KJV)
- [Is] not Calno as Carchemish? [is] not Hamath as Arpad? [is] not Samaria as Damascus?
- World English Bible (WEB)
- Isn’t Calno like Carchemish? Isn’t Hamath like Arpad? Isn’t Samaria like Damascus?”
- American Standard Version (ASV)
- Is not Calno as Carchemish? is not Hamath as Arpad? is not Samaria as Damascus?
- Bible in Basic English (BBE)
- Will not the fate of Calno be like that of Carchemish? is not Hamath as Arpad? is not Samaria as Damascus?
- Darby Translation (DBY)
- Is not Calno as Karkemish? Is not Hamath as Arpad? Is not Samaria as Damascus?
- Webster's Bible (WBS)
- [Is] not Calno as Carchemish? [is] not Hamath as Arpad? [is] not Samaria as Damascus?
- Young's Literal Translation (YLT)
- Is not Calno as Carchemish? Is not Hamath as Arpad? Is not Samaria as Damascus?
Read in context
- 7అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.
- 8అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?
- 9కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
- 10విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
- 11షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.
Cross references
- 2 Chronicles 35:20 2 దినవృత్తాంతములు 35:20ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిర మును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలు దేరెను.
- 2 Kings 16:9 2 రాజులు 16:9అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.
- Jeremiah 46:2 యిర్మీయా 46:2ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.
- Genesis 10:10 ఆదికాండము 10:10షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
- 2 Kings 17:5–6 2 రాజులు 17:5–6అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను. హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.
- Amos 6:1–2 ఆమోసు 6:1–2సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి; అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.
- Jeremiah 49:23 యిర్మీయా 49:23దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
- 2 Kings 18:9–10 2 రాజులు 18:9–10రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను. మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.
- 2 Kings 17:24 2 రాజులు 17:24అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించు కొని దాని పట్టణములలో కాపురము చేసిరి.
- Isaiah 17:3 యెషయా 17:3ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.
- 2 Samuel 8:9 2 సమూయేలు 8:9దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమా చారము హమాతు రాజైన తోయికి వినబడెను.
- Isaiah 7:8 యెషయా 7:8దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీనురాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.