Isaiah · chapter 28 · verse 5
Isaiah 28:5 in Telugu
ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.
Aa dinamuna sainyamulakadhipatiyagu yehovaa sheshim china tana prajalaku taane bhooshana kireetamugaa nundunu saundaryamugala makutamugaa nundunu.
Isaiah 28:5 in English
- King James Version (KJV)
- In that day shall the LORD of hosts be for a crown of glory, and for a diadem of beauty, unto the residue of his people,
- World English Bible (WEB)
- In that day, the LORD of Armies will become a crown of glory and a diadem of beauty to the residue of his people,
- American Standard Version (ASV)
- In that day will Jehovah of hosts become a crown of glory, and a diadem of beauty, unto the residue of his people;
- Bible in Basic English (BBE)
- In that day will the Lord of armies be a crown of glory, and a fair ornament, to the rest of his people;
- Darby Translation (DBY)
- In that day will Jehovah of hosts be for a crown of glory, and for a diadem of beauty, unto the remnant of his people;
- Webster's Bible (WBS)
- In that day will the LORD of hosts be for a crown of glory, and for a diadem of beauty, to the residue of his people,
- Young's Literal Translation (YLT)
- In that day is Jehovah of Hosts For a crown of beauty, and for a diadem of glory, To the remnant of His people.
Read in context
- 3త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.
- 4ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.
- 5ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.
- 6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
- 7అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.
Cross references
- 1 Peter 5:4 1 పేతురు 5:4ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
- Isaiah 62:3 యెషయా 62:3నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
- Isaiah 60:19 యెషయా 60:19ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
- Romans 11:5–6 రోమీయులకు 11:5–6ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.
- Jeremiah 9:23–24 యిర్మీయా 9:23–24యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Psalm 90:16–17 కీర్తనలు 90:16–17నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
- Job 29:14 యోబు 29:14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- Isaiah 41:16 యెషయా 41:16నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
- Isaiah 45:25 యెషయా 45:25యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.
- 1 Corinthians 1:30–31 1 కొరింథీయులకు 1:30–31అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
- Isaiah 10:20–21 యెషయా 10:20–21ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును.
- Isaiah 60:1–3 యెషయా 60:1–3నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.