Isaiah · chapter 32 · verse 9
Isaiah 32:9 in Telugu
సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
Sukhaasaktigala streelaaraa, lechi naa maata vinudi nishchintagaanunna kumaartelaaraa, naa maata vinudi.
Isaiah 32:9 in English
- King James Version (KJV)
- Rise up, ye women that are at ease; hear my voice, ye careless daughters; give ear unto my speech.
- World English Bible (WEB)
- Rise up, you women who are at ease! Hear my voice! You careless daughters, give ear to my speech!
- American Standard Version (ASV)
- Rise up, ye women that are at ease, [and] hear my voice; ye careless daughters, give ear unto my speech.
- Bible in Basic English (BBE)
- Give ear to my voice, you women who are living in comfort; give attention to my words, you daughters who have no fear of danger.
- Darby Translation (DBY)
- Rise up, ye women that are at ease, hear my voice; ye careless daughters, give ear unto my speech.
- Webster's Bible (WBS)
- Rise up, ye women that are at ease; hear my voice, ye careless daughters; give ear to my speech.
- Young's Literal Translation (YLT)
- Women, easy ones, rise, hear my voice, Daughters, confident ones, give ear [to] my saying,
Read in context
- 7మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
- 8ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- 9సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
- 10నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
- 11సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.
Cross references
- Isaiah 3:16 యెషయా 3:16మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
- Isaiah 28:23 యెషయా 28:23చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి
- Matthew 13:9 మత్తయి 13:9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Jeremiah 48:11–12 యిర్మీయా 48:11–12మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
- Jeremiah 6:2–6 యిర్మీయా 6:2–6సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్లగించుచున్నాను. గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.
- Zephaniah 2:15 జెఫన్యా 2:15నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.
- Lamentations 4:5 విలాపవాక్యములు 4:5సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
- Psalm 49:1–2 కీర్తనలు 49:1–2సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
- Judges 9:7 న్యాయాధిపతులు 9:7అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.
- Isaiah 47:7–8 యెషయా 47:7–8నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము
- Amos 6:1–6 ఆమోసు 6:1–6సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి; అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా. ఉపద్రవ దినము బహుదూరముననున్న దనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయు దురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
- Deuteronomy 28:56 ద్వితీయోపదేశకాండము 28:56నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును