Isaiah · chapter 34 · verse 1
Isaiah 34:1 in Telugu
రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.
Raashtramulaaraa, naayoddaku vachchi vinudi janamulaaraa, chevi yoggi aalakinchudi bhoomiyu daani sampoornatayu lokamunu daanilo puttinadantayu vinunu gaaka.
Isaiah 34:1 in English
- King James Version (KJV)
- Come near, ye nations, to hear; and hearken, ye people: let the earth hear, and all that is therein; the world, and all things that come forth of it.
- World English Bible (WEB)
- Come near, you nations, to hear! Listen, you peoples. Let the earth and all it contains hear, the world, and everything that comes from it.
- American Standard Version (ASV)
- Come near, ye nations, to hear; and hearken, ye peoples: let the earth hear, and the fulness thereof; the world, and all things that come forth from it.
- Bible in Basic English (BBE)
- Come near, you nations, and give ear; take note, you peoples: let the earth and everything in it give ear; the world and all those living in it.
- Darby Translation (DBY)
- Come near, ye nations, to hear; and hearken, ye peoples: let the earth hear, and all its fulness; the world, and all that cometh forth of it.
- Webster's Bible (WBS)
- Come near, ye nations, to hear; and hearken, ye people: let the earth hear, and all that is in it; the world, and all things that spring from it.
- Young's Literal Translation (YLT)
- Come near, ye nations, to hear, And ye peoples, give attention, Hear doth the earth and its fulness, The world, and all its productions.
Read in context
- 1రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.
- 2యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.
- 3వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
Cross references
- Isaiah 43:9 యెషయా 43:9సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమేయని యొప్పుకొనవలెను.
- Isaiah 41:1 యెషయా 41:1ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.
- 1 Corinthians 10:26 1 కొరింథీయులకు 10:26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
- Isaiah 1:2 యెషయా 1:2యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
- Jeremiah 22:29 యిర్మీయా 22:29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.
- Micah 6:1–2 మీకా 6:1–2యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.
- Deuteronomy 32:1 ద్వితీయోపదేశకాండము 32:1ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
- Isaiah 33:13 యెషయా 33:13దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
- Psalm 50:1 కీర్తనలు 50:1దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
- Isaiah 49:1 యెషయా 49:1ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.
- Psalm 49:1–2 కీర్తనలు 49:1–2సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
- Isaiah 18:3 యెషయా 18:3పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.