Isaiah · chapter 41 · verse 4
Isaiah 41:4 in Telugu
ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
Evadu deeni naalochinchi jariginchenu? Aadinundi maanava vanshamulanu pilichinavaadanaina yehovaanagu nene nenu modativaadanu kadavarivaaritonu unduvaadanu.
Isaiah 41:4 in English
- King James Version (KJV)
- Who hath wrought and done [it], calling the generations from the beginning? I the LORD, the first, and with the last; I [am] he.
- World English Bible (WEB)
- Who has worked and done it, calling the generations from the beginning? I, the LORD, the first, and with the last, I am he.”
- American Standard Version (ASV)
- Who hath wrought and done it, calling the generations from the beginning? I, Jehovah, the first, and with the last, I am he.
- Bible in Basic English (BBE)
- Whose purpose and work was it? His who sent out the generations from the start. I the Lord, the first, and with the last, I am he.
- Darby Translation (DBY)
- Who hath wrought and done [it], calling the generations from the beginning? I, Jehovah, the first; and with the last, I [am] HE.
- Webster's Bible (WBS)
- Who hath wrought and done [it] , calling the generations from the beginning? I the LORD, the first, and with the last; I [am] he.
- Young's Literal Translation (YLT)
- Who hath wrought and done, Calling the generations from the first? I, Jehovah, the first, and with the last I [am] He.
Read in context
- 2తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.
- 3అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.
- 4ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
- 5ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు
- 6వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు.
Cross references
- Isaiah 48:12 యెషయా 48:12యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను
- Revelation 22:13 ప్రకటన 22:13నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- Isaiah 46:10 యెషయా 46:10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
- Isaiah 44:6–7 యెషయా 44:6–7ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.
- Revelation 1:8 ప్రకటన 1:8అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- Isaiah 41:26 యెషయా 41:26మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వాడెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు.
- Isaiah 43:10 యెషయా 43:10మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
- Deuteronomy 32:7–8 ద్వితీయోపదేశకాండము 32:7–8పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
- Acts 17:26 అపొస్తలుల కార్యములు 17:26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- Revelation 2:8 ప్రకటన 2:8స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా
- Isaiah 42:24 యెషయా 42:24యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితివిు వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?