Isaiah · chapter 63 · verse 17
Isaiah 63:17 in Telugu
యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
Yehovaa nee maargamulanu tappi tirugunatlugaa mammunu enduku tolagajesitivi? Nee bhayamu viduchunatlu maa hrudayamulanu neevenduku kathinaparachitivi? Nee daasula nimittamu nee svaasthyagotramula nimittamu tirigi rammu.
Isaiah 63:17 in English
- King James Version (KJV)
- O LORD, why hast thou made us to err from thy ways, [and] hardened our heart from thy fear? Return for thy servants’ sake, the tribes of thine inheritance.
- World English Bible (WEB)
- O LORD, why do you make us wander from your ways, and harden our heart from your fear? Return for your servants’ sake, the tribes of your inheritance.
- American Standard Version (ASV)
- O Jehovah, why dost thou make us to err from thy ways, and hardenest our heart from thy fear? Return for thy servants’ sake, the tribes of thine inheritance.
- Bible in Basic English (BBE)
- O Lord, why do you send us wandering from your ways, making our hearts hard, so that we have no fear of you? Come back, because of your servants, the tribes of your heritage.
- Darby Translation (DBY)
- Why, O Jehovah, hast thou made us to err from thy ways, hast hardened our heart from thy fear? Return for thy servants' sake, the tribes of thine inheritance.
- Webster's Bible (WBS)
- O LORD, why hast thou made us to err from thy ways, [and] hardened our heart from thy fear? Return for thy servants' sake, the tribes of thy inheritance.
- Young's Literal Translation (YLT)
- Why causest Thou us to wander, O Jehovah, from Thy ways? Thou hardenest our heart from Thy fear, Turn back for Thy servants' sake, The tribes of Thine inheritance.
Read in context
- 15పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.
- 16మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.
- 17యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
- 18నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి యున్నారు.
- 19నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతివిు నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతివిు.
Cross references
- Isaiah 6:10 యెషయా 6:10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Ezekiel 14:7–9 యెహెజ్కేలు 14:7–9ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశుల లోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసెదను. మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలముచేసెదను
- Joshua 11:20 యెహోషువ 11:20వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను.
- Deuteronomy 2:30 ద్వితీయోపదేశకాండము 2:30అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
- Isaiah 29:13 యెషయా 29:13ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
- John 12:40 యోహాను 12:40వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.
- Numbers 10:36 సంఖ్యాకాండము 10:36అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
- Psalm 90:13 కీర్తనలు 90:13యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
- 2 Thessalonians 2:11–12 2 థెస్సలొనీకయులకు 2:11–12ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
- Zechariah 1:12 జెకర్యా 1:12అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
- Romans 9:18–20 రోమీయులకు 9:18–20కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
- Psalm 80:14 కీర్తనలు 80:14సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.