Psalms · chapter 80 · verse 14
Psalm 80:14 in Telugu
సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.
Sainyamulakadhipativagu devaa, aakaashamulonundi marala choodumu ee draakshaavallini drushtinchumu.
Psalm 80:14 in English
- King James Version (KJV)
- Return, we beseech thee, O God of hosts: look down from heaven, and behold, and visit this vine;
- World English Bible (WEB)
- Turn again, we beg you, God of Armies. Look down from heaven, and see, and visit this vine,
- American Standard Version (ASV)
- Turn again, we beseech thee, O God of hosts: Look down from heaven, and behold, and visit this vine,
- Bible in Basic English (BBE)
- Come back, O God of armies: from heaven let your eyes be turned to this vine, and give your mind to it,
- Darby Translation (DBY)
- O God of hosts, return, we beseech thee; look down from the heavens, and behold, and visit this vine;
- Webster's Bible (WBS)
- Return, we beseech thee, O God of hosts: look down from heaven, and behold, and visit this vine;
- Young's Literal Translation (YLT)
- God of Hosts, turn back, we beseech Thee, Look from heaven, and see, and inspect this vine,
Read in context
- 12త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
- 13అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
- 14సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.
- 15నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము.
- 16అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు.
Cross references
- Isaiah 63:15 యెషయా 63:15పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.
- Psalm 90:13 కీర్తనలు 90:13యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
- Malachi 3:7 మలాకీ 3:7మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవియ్యగామేము దేనివిషయ ములో తిరుగుదుమని మీరందురు.
- Isaiah 63:17 యెషయా 63:17యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
- Daniel 9:16–19 దానియేలు 9:16–19ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
- Acts 15:16 అపొస్తలుల కార్యములు 15:16ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
- Joel 2:14 యోవేలు 2:14ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?
- Lamentations 3:50 విలాపవాక్యములు 3:50నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
- Psalm 7:7 కీర్తనలు 7:7జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
- Psalm 33:13 కీర్తనలు 33:13యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.