Jeremiah · chapter 21 · verse 1
Jeremiah 21:1 in Telugu
రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి
Raajaina sidkiyaa malkeeyaa kumaarudaina pashoorunu yaajakudagu mayasheyaa kumaarudaina jephanyaanu pilipinchi
Jeremiah 21:1 in English
- King James Version (KJV)
- The word which came unto Jeremiah from the LORD, when king Zedekiah sent unto him Pashur the son of Melchiah, and Zephaniah the son of Maaseiah the priest, saying,
- World English Bible (WEB)
- The word which came to Jeremiah from the LORD, when King Zedekiah sent to him Pashhur the son of Malchijah, and Zephaniah the son of Maaseiah, the priest, saying,
- American Standard Version (ASV)
- The word which came unto Jeremiah from Jehovah, when king Zedekiah sent unto him Pashhur the son of Malchijah, and Zephaniah the son of Maaseiah, the priest, saying,
- Bible in Basic English (BBE)
- The word which came to Jeremiah from the Lord, when King Zedekiah sent to him Pashhur, the son of Malchiah, and Zephaniah, the son of Maaseiah the priest, saying,
- Darby Translation (DBY)
- The word that came unto Jeremiah from Jehovah, when king Zedekiah sent unto him Pashur the son of Malchijah, and Zephaniah the son of Maaseiah, the priest, saying,
- Webster's Bible (WBS)
- The word which came to Jeremiah from the LORD, when king Zedekiah sent to him Pashur the son of Melchiah, and Zephaniah the son of Maaseiah the priest, saying,
- Young's Literal Translation (YLT)
- The word that hath been unto Jeremiah from Jehovah, in the king Zedekiah's sending unto him Pashhur son of Malchiah, and Zephaniah son of Maaseiah the priest, saying,
Read in context
- 1రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి
- 2బబులోనురాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
- 3యిర్మీయా వారితో ఇట్లనెను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి
Cross references
- Jeremiah 29:25 యిర్మీయా 29:25ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- Jeremiah 37:3 యిర్మీయా 37:3రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు పంపిదయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.
- Jeremiah 38:1 యిర్మీయా 38:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.
- Jeremiah 52:24 యిర్మీయా 52:24మరియు రాజదేహసంరక్షకుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టు కొనెను.
- Jeremiah 32:1–3 యిర్మీయా 32:1–3యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతనిచూచును,
- Jeremiah 52:1–3 యిర్మీయా 52:1–3సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను. యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా
- Jeremiah 37:1 యిర్మీయా 37:1బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.
- 2 Kings 24:17–18 2 రాజులు 24:17–18మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.
- 1 Chronicles 9:12 1 దినవృత్తాంతములు 9:12మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
- 2 Kings 25:18–21 2 రాజులు 25:18–21రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరా యాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వార పాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజుసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను. రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.
- 2 Chronicles 36:10–13 2 దినవృత్తాంతములు 36:10–13ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహో దరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణ ములను తెప్పించెను. సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.
- Nehemiah 11:12 నెహెమ్యా 11:12ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.
Original words (Hebrew)
- word · H1697דָּבָר dâbâr
- Jeremiah · H3414יִרְמְיָה Yirmᵉyâh
- king · H4428מֶלֶךְ melek
- Zedekiah · H6667צִדְקִיָּה Tsidqîyâh
- sent · H7971שָׁלַח shâlach
- Pashur · H6583פַּשְׁחוּר Pashchûwr
- son · H1121בֵּן bên
- Melchiah · H4441מַלְכִּיָּה Malkîyâh
- Zephaniah · H6846צְפַנְיָה Tsᵉphanyâh
- son · H1121בֵּן bên
- Maaseiah · H4641מַעֲשֵׂיָה Maʻăsêyâh
- priest · H3548כֹּהֵן kôhên
- saying · H559אָמַר ʼâmar