Jeremiah · chapter 21 · verse 2
Jeremiah 21:2 in Telugu
బబులోనురాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
Babulonuraajaina nebukadrejaru manameeda yuddhamucheyuchunnaadu; atadu manayoddanundi velli povunatlu yehovaa tana adbhutakaaryamulannitini choopi manaku todaiyunduno ledo dayachesi maa nimittamu yehovaa cheta neevu vichaarinchumani chepputaku yirmeeyaayoddaku vaarini pampagaa yehovaayoddanundi yirmeeyaaku pratyakshamaina vaakku.
Jeremiah 21:2 in English
- King James Version (KJV)
- Enquire, I pray thee, of the LORD for us; for Nebuchadrezzar king of Babylon maketh war against us; if so be that the LORD will deal with us according to all his wondrous works, that he may go up from us.
- World English Bible (WEB)
- “Please inquire of the LORD for us; for Nebuchadnezzar king of Babylon makes war against us. Perhaps the LORD will deal with us according to all his wondrous works, that he may withdraw from us.”
- American Standard Version (ASV)
- Inquire, I pray thee, of Jehovah for us; for Nebuchadrezzar king of Babylon maketh war against us: peradventure Jehovah will deal with us according to all his wondrous works, that he may go up from us.
- Bible in Basic English (BBE)
- Will you get directions from the Lord for us; for Nebuchadrezzar, king of Babylon, is making war against us; it may be that the Lord will do something for us like all the wonders he has done, and make him go away from us.
- Darby Translation (DBY)
- Inquire, I pray thee, of Jehovah for us; for Nebuchadrezzar the king of Babylon maketh war against us; if so be that Jehovah will deal with us according to all his marvellous works, that he may go up from us.
- Webster's Bible (WBS)
- Inquire, I pray thee, of the LORD for us; for Nebuchadnezzar king of Babylon maketh war against us; it may be that the LORD will deal with us according to all his wondrous works, that he may go up from us.
- Young's Literal Translation (YLT)
- 'Inquire, we pray thee, for us at Jehovah, for Nebuchadrezzar king of Babylon hath fought against us; perhaps Jehovah doth deal with us according to all His wonders, and doth cause him to go up from off us.'
Read in context
- 1రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి
- 2బబులోనురాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
- 3యిర్మీయా వారితో ఇట్లనెను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి
- 4ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయోగించుచున్న యుద్దాయుధములను ప్రాకారముల బయట నుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.
Cross references
- Jeremiah 37:3 యిర్మీయా 37:3రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు పంపిదయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.
- Jeremiah 37:7 యిర్మీయా 37:7ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
- Ezekiel 20:1–3 యెహెజ్కేలు 20:1–3ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Jeremiah 42:4–6 యిర్మీయా 42:4–6కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెల విచ్చునదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
- 1 Samuel 28:6 1 సమూయేలు 28:6యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారా నైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.
- Psalm 44:1–4 కీర్తనలు 44:1–4దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము.
- 1 Kings 14:2–3 1 రాజులు 14:2–3యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యౌవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా
- 1 Samuel 28:15 1 సమూయేలు 28:15సమూయేలునన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలునేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.
- Jeremiah 39:1–2 యిర్మీయా 39:1–2యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చిదాని ముట్టడివేయగా సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
- Judges 20:27 న్యాయాధిపతులు 20:27ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను.
- Exodus 14:1–15 నిర్గమకాండము 14:1–15మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి - వారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడి మనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివిు అని చెప్పుకొనిరి. అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను. మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను. యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లు చుండిరి. ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱము లన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి. అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
- Psalm 48:4–8 కీర్తనలు 48:4–8రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి. వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా. )