Jeremiah · chapter 31 · verse 38
Jeremiah 31:38 in Telugu
యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.
Yehovaa eelaagu sela vichchuchunnaadu raabovu dinamulalo hananyelu gopuramu modalukoni moolagummamuvaraku pattanamu yehovaa perata kattabadunu.
Jeremiah 31:38 in English
- King James Version (KJV)
- Behold, the days come, saith the LORD, that the city shall be built to the LORD from the tower of Hananeel unto the gate of the corner.
- World English Bible (WEB)
- “Behold, the days come,” says the LORD, “that the city will be built to the LORD from the tower of Hananel to the gate of the corner.
- American Standard Version (ASV)
- Behold, the days come, saith Jehovah, that the city shall be built to Jehovah from the tower of Hananel unto the gate of the corner.
- Bible in Basic English (BBE)
- See, the days are coming, says the Lord, for the building of the Lord's town, from the tower of Hananel to the doorway of the angle.
- Darby Translation (DBY)
- Behold, the days come, saith Jehovah, that the city shall be built to Jehovah, from the tower of Hananeel unto the corner-gate.
- Webster's Bible (WBS)
- Behold, the days come, saith the LORD, that the city shall be built to the LORD from the tower of Hananeel to the gate of the corner.
- Young's Literal Translation (YLT)
- Lo, days [are coming], an affirmation of Jehovah, And the city hath been built to Jehovah, From the tower of Hananeel to the gate of the corner.
Read in context
- 36ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.
- 37యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.
- 38యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.
- 39కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.
- 40శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.
Cross references
- Zechariah 14:10 జెకర్యా 14:10యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
- 2 Kings 14:13 2 రాజులు 14:13మరియు ఇశ్రా యేలు రాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూష లేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.
- Jeremiah 30:18 యిర్మీయా 30:18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులుగలదగును.
- 2 Chronicles 26:9 2 దినవృత్తాంతములు 26:9మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.
- Jeremiah 31:27 యిర్మీయా 31:27యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
- Nehemiah 12:30–40 నెహెమ్యా 12:30–40యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి. అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను. వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి. మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు అతని బంధు వులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారిముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహ ములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.
- Ezekiel 48:30–35 యెహెజ్కేలు 48:30–35పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము. ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను. తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీను దనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను. దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారు దనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను. పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణ ముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలి దనియు మూడు గుమ్మములుండవలెను. దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
- Isaiah 44:28 యెషయా 44:28కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.
- Daniel 9:25 దానియేలు 9:25యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.
- Jeremiah 23:5 యిర్మీయా 23:5యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.