Jeremiah · chapter 50 · verse 36
Jeremiah 50:36 in Telugu
ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
Pragalbhamulu palukuvaaru khadgavashulai pichchivaandraguduru. Balaadhyulu nirmoolamaguvaraku khadgamu vaarimeeda padunu
Jeremiah 50:36 in English
- King James Version (KJV)
- A sword [is] upon the liars; and they shall dote: a sword [is] upon her mighty men; and they shall be dismayed.
- World English Bible (WEB)
- A sword is on the boasters, and they will become fools. A sword is on her mighty men, and they will be dismayed.
- American Standard Version (ASV)
- A sword is upon the boasters, and they shall become fools; a sword is upon her mighty men, and they shall be dismayed.
- Bible in Basic English (BBE)
- A sword is on the men of pride, and they will become foolish: a sword is on her men of war, and they will be broken.
- Darby Translation (DBY)
- the sword is upon the liars, and they shall become fools; the sword is upon her mighty men, and they shall be dismayed;
- Webster's Bible (WBS)
- A sword [is] upon the liars; and they shall be sottish: a sword [is] upon her mighty men; and they shall be dismayed.
- Young's Literal Translation (YLT)
- A sword [is] on the princes, And they have become foolish; A sword [is] on her mighty ones, And they have been broken down;
Read in context
- 34వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
- 35యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు
- 36ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
- 37ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.
- 38నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
Cross references
- Jeremiah 49:22 యిర్మీయా 49:22శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
- Isaiah 44:25 యెషయా 44:25నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
- Nahum 3:13 నహూము 3:13నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.
- 2 Thessalonians 2:9–11 2 థెస్సలొనీకయులకు 2:9–11నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,
- Jeremiah 51:30 యిర్మీయా 51:30బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
- Revelation 21:8 ప్రకటన 21:8పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
- Revelation 22:15 ప్రకటన 22:15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
- 1 Timothy 6:4 1 తిమోతికి 6:4వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
- Revelation 19:20 ప్రకటన 19:20అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
- Jeremiah 48:30 యిర్మీయా 48:30అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు
- Isaiah 47:10–15 యెషయా 47:10–15నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు.
- Jeremiah 50:30 యిర్మీయా 50:30కావున ఆ దినమున దాని ¸యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.